Homeఎంటర్టైన్మెంట్Robin Hood : రాబిన్ హుడ్ లో అసభ్యకర స్టెప్, నోరు విప్పిన కేతిక శర్మ,...

రాబిన్ హుడ్ లో అసభ్యకర స్టెప్, నోరు విప్పిన కేతిక శర్మ, ఏమందంటే?

Robin Hood : ఇండియాలో మాస్ ఆడియన్స్ ఎక్కువ. అందుకే కళాత్మక చిత్రాల కంటే కమర్షియల్ చిత్రాలకు మార్కెట్ ఉంటుంది. ఒక సినిమాలో సాంగ్స్, ఫైట్స్, కామెడీ, రొమాన్స్,ఎమోషన్ సమపాళ్లలో ఉండాలి. అలాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు దక్కించుకుంటాయి. మన సినిమాల్లో సాంగ్స్ కి ఎంతో ప్రాధాన్యత ఉంది. లయబద్దంగా హీరో హీరోయిన్ వేసే డాన్స్ మూమెంట్స్ ని ప్రేక్షకులు ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. స్పషల్ సాంగ్స్ కల్చర్ దశాబ్దాలుగా ఇండియన్ సినిమాల్లో కొనసాగుతుంది.

Also Read : ‘రాబిన్ హుడ్’ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్..నితిన్ మారకపోతే కష్టమే!

స్పెషల్ సాంగ్స్ లో గ్లామర్ డోస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. డాన్స్ మూమెంట్స్ తో పాటు సాహిత్యం ద్వంద్వ అర్థాలతో కూడుకుని ఉంటాయి. ఐటెం గర్ల్ వేసే మూమెంట్స్ కొన్ని సందర్భాల్లో వల్గారిటీకి దారి తీయవచ్చు. ఇటీవల విడుదలైన రాబిన్ హుడ్ విషయంలో అదే జరిగింది. నితిన్-శ్రీలీల జంటగా నటించిన రాబిన్ హుడ్ చిత్రంలో కేతిక శర్మ స్పెషల్ సాంగ్ చేసింది. ‘అదిదా సర్ప్రైజ్’ అనే ఆ పాటలో కేతిక శర్మ వేసిన స్టెప్ వివాదం రాజేసింది. సాంప్రదాయవాదులు సోషల్ మీడియా వేదికగా ఏకిపారేశారు.

అదిదా సర్ప్రైజ్ పాటకు కొరియోగ్రఫీ అందించిన శేఖర్ మాస్టర్ ని జనాలు ట్రోల్ చేశారు. ఆయన పని చేసిన మిస్టర్ బచ్చన్, డాకు మహారాజ్ చిత్రాల్లోని స్టెప్స్ కూడా అసభ్యకరంగా ఉన్నాయంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో, శేఖర్ మాస్టర్ తీవ్ర విమర్శలకు గురయ్యాడు. దాంతో శేఖర్ మాస్టర్ వివరణ ఇచ్చుకున్నాడు. ఒక స్టెప్ విషయంలో తాను మాత్రమే నిర్ణయం తీసుకోను. హీరో, దర్శకుడు, నిర్మాతతో చర్చించిన తర్వాతే ఫైనల్ చేస్తామని అన్నాడు.

Also Read : ‘రాబిన్ హుడ్’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు..ఎపిక్ డిజాస్టర్!

కాగా రాబిన్ హుడ్ సాంగ్ వివాదం పై కేతిక శర్మ స్పందించారు. ఆమె నటించిన సింగిల్ మూవీ విడుదల నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన కేతిక శర్మ.. రాబిన్ హుడ్ లోని అదిదా సర్ప్రైజ్ పాటను ఎంజాయ్ చేశారు. అందుకు సంతోషించాను. అయితే ఆ పాట వివాదాస్పదం కావడం కొన్ని విషయాలు నేర్పింది. ఇకపై అలాంటి పాటలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను, అన్నారు. తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ.. హిందీలో ఒకటి, తెలుగు-తమిళ్ ద్విభాషా చిత్రం మరొకటి చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. సింగిల్ మూవీ ఆద్యంతం నవ్వులు పూయిస్తుందని విశ్వాసం వ్యక్తం చేసింది.

RELATED ARTICLES

Most Popular