Pallavi Prashanth: ఎట్టకేలకు బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ బుద్ది మారింది…ట్రోల్స్ దెబ్బకు ఏం చేశాడో తెలుసా?

బిగ్ బాస్ తెలుగు 7 టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఎట్టకేలకు దిగొచ్చాడు. సోషల్ మీడియా జనాలు ఏకిపారేయడంతో దారిన పడ్డాడు. మరొక సహాయం చేశాడు. ఈ మేరకు పల్లవి ప్రశాంత్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది. తిరిగి నెటిజెన్స్ పల్లవి ప్రశాంత్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Written By: S Reddy, Updated On : August 3, 2024 9:42 am

Pallavi Prashanth

Follow us on

Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ 7 లో రైతుబిడ్డగా అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. తనని గెలిపిస్తే వచ్చిన ప్రైజ్ మనీ మొత్తం పేద రైతులకు పంచిపెడతానని మాటిచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా సార్లు అదే చెప్పుకొచ్చాడు. మాటల్లోనే కానీ ఆవైపుగా అడుగులు వేసిన దాఖలాలు లేవు. బిగ్ బాస్ ముగిసి నెలలు గడుస్తున్నా పల్లవి ప్రశాంత్ ఒక్కరికి కూడా సాయం చేసింది లేదు. పైగా ప్రమోషన్స్, టీవీ ఈవెంట్లు, షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ అంటూ తెగ హంగామా చేశాడు.

దీంతో నెటిజన్లు రైతుబిడ్డ ఇచ్చిన మాట గాలికి వదిలేశాడు. ఒట్టు తీసి గట్టు మీద పెట్టాడు. ఇంకెప్పుడు నువ్వు రైతులకు డబ్బు పంచేది అంటూ ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. దీంతో పల్లవి ప్రశాంత్ ఆ మధ్య ఓ నిరుపేద రైతు కుటుంబానికి లక్ష రూపాయలు దానం చేశాడు. ఆ తర్వాత మళ్లీ సైలెంట్ అయిపోయాడు. ప్రశాంత్ మొదటి సాయం చేసి ఇప్పటికే నాలుగు నెలలు గడుస్తుంది. పైగా త్వరలో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ కూడా మొదలుకానుంది.

కానీ ప్రశాంత్ మాత్రం ఇచ్చిన మాట మరిచిపోయాడు. బిగ్ బాస్ స్నేహితులతో బర్త్ డే పార్టీలు చేసుకుంటూ, ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్లు దారుణం ట్రోల్ చేస్తున్నారు. రైతుబిడ్డను ఏకిపారేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దీంతో తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్లు, ట్రోలింగ్ దెబ్బకు ప్రశాంత్ దిగి వచ్చాడు.

ఇచ్చిన మాట ప్రకారం మరో పేద రైతు కుటుంబానికి ఆర్థిక సాయం చేశాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ” ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి అండగా నేను ఉన్నాను. జై జవాన్ జై కిసాన్” అంటూ వీడియో షేర్ చేశాడు. మెదక్ లోని చిన శంకర్ పేటకు చెందిన పరమేశ్వర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.

అతనికి ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. కుటుంబానికి అండగా ఉండాల్సిన భర్త చనిపోవడంతో ఆ భారమంతా శంకరమ్మపై పడింది. ముగ్గురు ఆడ పిల్లలను పెంచడం కష్టంగా మారింది. దీంతో పల్లవి ప్రశాంత్ ఆ శంకరమ్మకు రూ. 20 వేల రూపాయలు అందించాడు. కాగా పల్లవి ప్రశాంత్ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు.

పల్లవి ప్రశాంత్ కి ప్రైమ్ మనీ రూపంలో రూ. 35 లక్షలు దక్కాయి. ట్యాక్స్ కటింగ్స్ పోను రూ. 16 లక్షలు మిగిలాయని సమాచారం. ఈ డబ్బును పల్లవి ప్రశాంత్ పంచాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ. 1.20 లక్షలు సహాయం చేశాడు. మిగతా డబ్బులు దానం చేస్తాడో లేదో చూడాలి. ప్రైజ్ మనీ కాకుండా ఒక కారు, నెక్లెస్ పల్లవి ప్రశాంత్ గెలుచుకున్నాడు. వీటి విలువ రూ. 30 లక్షలు ఉంటుంది. సెలబ్రిటీ హోదా అనుభవిస్తున్న పల్లవి ప్రశాంత్ బాగానే సంపాదిస్తున్నాడట. ఒక సామాన్యుడి జీవితాన్ని బిగ్ బాస్ మార్చేసింది.