Ritu Chowdary Bigg Boss 9 Controversy: సోషల్ మీడియా లో నెటిజెన్స్ కి పరిచయం అక్కర్లేని పేరు రీతూ చౌదరి(Ritu Chowdary). గత ఏడాది ప్రసారమైన ‘బిగ్ బాస్ 9’ లో కంటెస్టెంట్ గా పాల్గొని తెలుగు ప్రేక్షకులకు ఇంకా బాగా దగ్గరైంది. అంతకు ముందు ఈమె అనేక సీరియల్స్ లో విలన్ గా నటించింది కానీ, బిగ్ బాస్ ఇచ్చినంత ఫేమ్ ఏ షో కూడా ఇవ్వలేదు అని చెప్పొచ్చు. అంతే కాదు పలు కాంట్రవర్సీలతో ఈమె పేరు టీవీ షోస్ లలో మారు మ్రోగిపోయింది. అప్పట్లో జనాలకు ఈమెపై సరైన అభిప్రాయం ఉండేది కాదు కానీ, బిగ్ బాస్ 9 లోకి వచ్చిన తర్వాత మాత్రం మంచి పాజిటివిటీ ని సంపాదించుకుంది. టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలుస్తుందని అంతా అనుకున్నారు కానీ , తృటిలో ఆ అవకాశాన్ని కోల్పోయింది. ఇకపోతే ఈమెకు తన తండ్రి అంటే ఎంత ప్రేమ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
వీళ్లిద్దరు తండ్రి కూతురు లాగా కాకుండా, స్నేహితులు లాగా ఉండేవారట. కానీ దురదృష్టం కొద్దీ ఆయన చనిపోయాడు. పలు ఇంటర్వ్యూస్ ఈమె తన తండ్రి గురించి మాట్లాడిన మాటలను చూస్తే అయ్యో పాపం అని కూడా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి తండ్రి ని రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో కుక్కతో పోల్చి మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది. ఆమె మాట్లాడుతూ ‘మూగ జీవాల కోసం రేణు దేశాయ్ , రష్మీ వంటి వారు చేసిన పోరాటం లో న్యాయం ఉంది. ఒక కుక్క ఎక్కడో ఎవరినో కరించిందని ప్రపంచం లో కుక్కలన్నిటినీ చంపేస్తారా? , అది చాలా పెద్ద తప్పు. నేను రెండు కుక్కల్ని పెంచుకున్తున్నాను . వాటితో నాకు గొప్ప అనుబంధం ఉంది , తోటి మనుషులతో కూడా అంతటి అనుబంధం ఏర్పడుతుందో లేదో చెప్పలేను’ అంటూ చెప్పుకొచ్చింది రీతూ చౌదరి.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘మనం కాసేపు వాటి కంటికి కనిపించకుండా, ఒక్కసారి ఇంటికి వచ్చిన తర్వాత దాని కళ్ళలో మనల్ని ఎంత మిస్ అయ్యిందో కనిపిస్తుంది. నేను ఏడిస్తే నా కుక్క అసలు తట్టుకోలేడు. నా కన్నీళ్లను కాళ్లతో తుడుస్తోంది. నా స్నేహితులు సరదాగా ఎవరైనా కొడితే అసలు ఊరుకోదు. వాళ్ళ మీదకు దూసుకెళ్తుంది. మా అన్నయ్య తో ఎప్పుడైనా నేను గొడవపడితే, ఆపండి మీ గొడవ అన్నట్టుగా అరుస్తుంది. ఇలాంటి అనుభూతులను కుక్కల్ని పెంచుకున్న వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. మా నాన్న జనవరి 22 న చనిపోయారు అదే రోజున నా పెంపుడు కుక్క కోకో పుట్టింది. నేను మా నాన్న నే మళ్లీ కోకో రూపం లో పుట్టాడని బలంగా నమ్ముతాను. మా నాన్న నన్ను ఎలా చూసుకునేవాడో , కోకో కూడా నన్ను అంతే ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది ‘ అంటూ చెప్పుకొచ్చింది రీతూ చౌదరి.