Ram Charan Birthday: పవిత్రమైన శ్రీరామనవమి రోజున గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) పుట్టిన రోజు వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గ్రాండ్ గా జరిగాయి. ప్రతీ చోట రక్త దానం, అన్నదానాలతో పాటుగా , పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మెగా అభిమానులు రామ్ చరణ్ కి మర్చిపోలేని పుట్టినరోజు ని బహుమతిగా ఇచ్చారు. ఇదే రోజున ఆయన హీరో గా నటించిన ‘పెద్ది’ మూవీ లేటెస్ట్ టీజర్ విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకోవడం మెగా అభిమానులకు మామూలు కిక్ ఇవ్వలేదు. ఇక నేడు శ్రీ రామనవమి మరియు తన కొడుకు పుట్టిన రోజు ఒకే రోజు రావడంతో మెగాస్టార్ చిరంజీవి ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. ఈ సందర్భంగా తన స్వగృహం లో మెగాస్టార్ చిరంజీవి , సురేఖ లు కలిసి రామ్ చరణ్ తో ప్రత్యేక హోమం చేయించి, అందుకు సంబంధించిన వీడియో ని మెగాస్టార్ చిరంజీవి ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశాడు.
Also Read: తెలంగాణలో మరో కొత్త పార్టీ.. ముహూర్తం ఫిక్స్ చేసిన కవిత
ఆ వీడియో లో రామ్ చరణ్ చక్కగా పట్టు వస్త్రాలను ధరించి, పూజారి చెప్పే మంత్రోచ్చారణ చేస్తూ కనిపించాడు. పక్కనే చిరంజీవి , సురేఖ లు కూడా ఉన్నారు. ఈ పోస్ట్ ని అప్లోడ్ చేస్తూ ‘శ్రీ రామజయం. ఆ శ్రీరాముడి అడుగుజాడల్లో అడుగుజాడల్లో నడిస్తే మనదే విజయం. ఈ ఏడాది శ్రీ రామనవమి రోజు యాదృచ్చికంగా చరణ్ బాబు పుట్టినరోజు కూడా కలిసి రావడం ఎంతో సంతోషాన్ని కలిగించే విషయం. రాముని చరణాల వద్ద తేజో రూపుడై కొలువుండే మా ఇలవేల్పు హనుమంతుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ, అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు’ అంటూ చెప్పుకొచ్చాడు చిరంజీవి. ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఈ పోస్ట్ క్రిందనే రామ్ చరణ్ ‘జై శ్రీరామ్’ అంటూ కామెంట్ చేయడం గమనార్హం.
ఇక రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ విషయానికి వస్తే వచ్చే నెల 30వ తారీఖున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్డేట్ కూడా వచ్చింది. రీసెంట్ గానే ‘ధురంధర్ 2’ తో పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ఒక రేంజ్ లో షేక్ చేసిన జియో స్టూడియోస్ సంస్థ , ‘పెద్ది’ చిత్రాన్ని నార్త్ ఇండియా లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతుంది. కాసేపటి క్రితమే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా జియో స్టూడియోస్ సంస్థ చేసింది. మరో పక్క ఈ సినిమా వాయిదా పడబోతోంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై ఏప్రిల్ మొదటి వారం లో స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.