Homeక్రీడలుక్రికెట్‌Bangalore Vs Hyderabad IPL 2026 Match Preview: రేపే బెంగళూరు, హైదరాబాద్ సమరం.. ప్లేయింగ్11...

Bangalore Vs Hyderabad IPL 2026 Match Preview: రేపే బెంగళూరు, హైదరాబాద్ సమరం.. ప్లేయింగ్11 అంచనా ఇదే

Bangalore Vs Hyderabad IPL 2026 Match Preview: ఐపీఎల్ 2026 సీజన్ రేపటినుంచి మొదలుకాబోతోంది. డిపెండింగ్ చాంపియన్ బెంగళూరు, హైదరాబాద్ జట్ల మధ్య చిన్నస్వామి స్టేడియంలో మార్చి 28న మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు సమవుజ్జీలు కావడంతో పోటీ హోరాహోరీగా సాగే అవకాశం కనిపిస్తోంది. రెండు జట్లలో బ్యాటర్లు, బౌలర్లు, ఫీల్డర్లు సమాన ప్రతిభ ఉన్న వారు ఉండటంతో అభిమానులకు వీనులవిందైన క్రికెట్ మజా లభించడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read: తెలంగాణలో మరో కొత్త పార్టీ.. ముహూర్తం ఫిక్స్‌ చేసిన కవిత

మ్యాచ్ నిర్వహించే మైదానంలో పిచ్ ను ప్లాట్ గా రూపొందించారు. దీంతో పరుగులు వరద లాగా ప్రవహించడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. రెండు జట్లలో కీలకమైన బ్యాటర్లు ఉన్నారు. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ ప్లేయర్ బెతల్ భీకరమైన ఇన్నింగ్స్ ఆడాడు.అతడు ప్రస్తుతం బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్నాడు. విరాట్ కోహ్లీ ఆ మధ్య దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో అదరగొట్టాడు. దీంతోవారిద్దరూ బెంగళూరు జట్టులో కీలకమైన ప్లేయర్లుగా కనిపిస్తున్నారు.

హైదరాబాద్ జట్టులో హెడ్, క్లాసెన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ కీలకమైన ప్లేయర్లుగా కనిపిస్తున్నారు. హెడ్ ఫామ్ గురించి పక్కన పెడితే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ లో అదరగొట్టారు. అభిషేక్ శర్మ కాస్త ఇబ్బంది పడినప్పటికీ, ఇషాన్ కిషన్ మాత్రం దంచి కొట్టాడు. పైగా అతడు ఈసారి హైదరాబాద్ జట్టుకు నాయకుడిగా ఉన్నాడు. దీంతో అతడి నుంచి ఆరేంజ్ ఆర్మీ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది.

బెంగళూరు, హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్ననేపథ్యంలో ప్లేయింగ్11 గురించి విపరీతమైన చర్చ సాగుతోంది. బెంగళూరు జట్టులో తుది స్థానంలో కోహ్లీ, సాల్డ్, వెంకటేష్ అయ్యర్, రజత్ పాటిదార్, డేవిడ్, జితేష్, షెపర్డ్, క్రునాల్ పాండ్యా, భువనేశ్వర్, జాకోబ్, మంగేశ్ ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ జట్టులో అభిషేక్ శర్మ, హెడ్, క్లాసెన్, ఇషాన్ కిషన్, లివింగ్ స్టోన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్, బ్రైడన్ కార్స్, హర్షల్, శివ్ నాగ్, జీషన్ కు చోటు లభించే అవకాశం ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version