https://oktelugu.com/

Guppedantha Manasu: వసుతో ప్రేమలో పడ్డ రిషి.. జగతి, మహేంద్రను కలిపే దిశగా అడుగులు?

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఇటీవలే ప్రారంభమవ్వగా.. అతి తక్కువ సమయంలోనే మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈ సీరియల్ ను యువత కూడా చూడటానికి ఇష్టపడుతున్నారు. ఇక రిషి, వసు ఒక ఊరిని మరింత డెవలప్ చేయడానికి నిశ్చయించుకోవడంతో ఆ ఊరి వాళ్లతో కొందరితో సమావేశం చేస్తారు. ఇక రిషి కుర్చీలో వచ్చిన సమయంలో వసు ఆపి అందులో దుమ్ము ఉంది సార్ అంటూ అక్కడున్న దుమ్మును తన చున్నీతో తుడుస్తుంది. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 13, 2021 / 11:40 AM IST
    Follow us on

    Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఇటీవలే ప్రారంభమవ్వగా.. అతి తక్కువ సమయంలోనే మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈ సీరియల్ ను యువత కూడా చూడటానికి ఇష్టపడుతున్నారు. ఇక రిషి, వసు ఒక ఊరిని మరింత డెవలప్ చేయడానికి నిశ్చయించుకోవడంతో ఆ ఊరి వాళ్లతో కొందరితో సమావేశం చేస్తారు. ఇక రిషి కుర్చీలో వచ్చిన సమయంలో వసు ఆపి అందులో దుమ్ము ఉంది సార్ అంటూ అక్కడున్న దుమ్మును తన చున్నీతో తుడుస్తుంది. వెంటనే రిషి డ్రెస్ పాడవుతుంది అని అన్నా కూడా పర్వాలేదు సర్ అంటూ అలాగే తుడుస్తుంది. వసుని అలాగే చూస్తూ ఉంటాడు రిషి. అక్కడున్న కొందరు సభ్యులతో తాము చేస్తున్న ప్లాన్ గురించి వివరిస్తారు.ఇక అక్కడ సమావేశం పూర్తయిన వెంటనే అక్కడ ఊరిలో తిరుగుతూ మాట్లాడుకుంటారు.

    ప్రాజెక్టు గురించి అద్భుతంగా చెప్పారు అంటూ వసును రిషి పొగుడుతాడు. ఇక వసు కూడా మరింత చేయాలి అన్నట్లు ఇంకా ప్రాజెక్టు గురించి వివరిస్తుంది. పేద వాళ్లకు మరింత సహాయం చేయాలి అంటూ తన ప్లాన్ వివరిస్తుంది. కొత్త టాపిక్ ఎందుకు తీస్తున్నావ్ అని రిషి అడగటంతో తన ప్రాజెక్ట్ ప్లాన్ గురించి మాట్లాడుతుంది. ఇక అక్కడ కనిపిస్తున్న వారితో మాట్లాడుతూ తమ ప్రాజెక్ట్ ల గురించి వివరిస్తుంది.వసు సేవ ను చూస్తూ తన తల్లి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటాడు. ఇక వసు సహాయం చేసిన విషయాన్ని రిషి ప్రశ్నించే సరికి వసు మాటలకు ఫిదా అయినట్లు కనిపిస్తాడు. ఇక వసు తన దగ్గర ఉన్నా ఒక చాక్లెట్ ను రిషికి ఇవ్వడంతో ఇద్దరం తీసుకుందామని చాక్లెట్ రెండు భాగాలు చేసే ప్రయత్నం చేస్తాడు.

    ఇక తను ఇబ్బంది పడటంతో వసు నేను ప్రయత్నిస్తా అనేసరికి కాస్త వెటకారంగా మాట్లాడి తనకే చాక్లెట్ బాగాలు చేయమని ఇస్తాడు. వసు కూడా ఇబ్బంది పడటంతో రిషి బాగా అయింది అన్నట్లు చూస్తాడు.వసు రిషి దగ్గర కర్చీఫ్ తీసుకొని మొత్తానికి చాక్లెట్ ను భాగాలు చేసి ఇస్తుంది. ఇక కారులో కూర్చుని రిషి ఆకలి కోసం ఇబ్బంది పడటంతో రిషి అతని దగ్గరున్న రెండు బాక్సులు తీస్తుంది. తినడానికి దొరుకుతుందో లేదో అని తెచ్చాను అంటుంది. ఇక బాక్సులు జగతి మేడమ్ ఇచ్చింది అని చెప్పకుండా జాగ్రత్త పడుతుంది. ఇక భోజనం చేయడానికి ఒక చెట్టు కిందకు వెళ్లడం అక్కడ వసు గడ్డి తో పరువడం చూసి ఫిదా అవుతాడు రిషి. ఇక తరువాయి భాగం లో కర్చీఫ్ చూసుకోని కాస్త రొమాంటిక్ గా ఫీల్ అవుతాడు రిషి.