దేశంలో కరోనా మహమ్మరి విజృంభిస్తుండటంతో రోజురోజుకు కోవిడ్-19పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్నిరోజుల క్రితం కేంద్రం లాక్డౌన్ అమలు చేస్తుంది. దీంతో ప్రతీఒక్కరూ ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్డౌన్ అమలుతో ప్రజా రవాణ స్తంభించిపోయింది. నిత్యావసరులకు అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండే మద్యంప్రియులకు మద్యం దొరకడంలేదని ఆత్మహత్యలకు పాల్పడున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి.
దీంతో మద్యంప్రియులకు అండగా బాలీవుడ్ సీనియర్ నటుడు రిషీ కపూర్ నిలిచారు. రోజులో రెండు గంటలైనా మద్యం షాపులు తెరవాలని కోరుతున్న మద్యంప్రియులకు ఆయన మద్దతు పలికారు. ప్రతిరోజూ సాయంత్రం లిక్కర్ షాపులు తెరవాలంటూ రిషికపూర్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వానికి ఆయన ట్వీటర్లో పలు సూచనలు చేశారు. లైసెన్స్ ఉన్న మద్యం దుకాణాలను కొంతకాలం సాయంత్ర వేళల్లో తెరిస్తే బావుంటుందని.. దీనిని ప్రజలు తప్పుగా అర్థం చేసుకుని తనను తిట్టొద్దని కోరారు.
కరోనా కట్టడికి ప్రభుత్వాలకు ఎక్సైజ్ శాఖ నుంచి డబ్బులు అవసరమని అన్నారు. అంతేకాకుండా లాక్డౌన్ కారణంగా ప్రజల్లో ఓ రకమైన అనిశ్చితి, నిరాశ నెలకొంటుందని తెలిపారు. ఈ సమయంలో మనిషికి మద్యం అవసరముంటుందని పేర్కొన్నారు. కనీసం బ్లాక్‌లో అయినా మద్యం అమ్మే ఏర్పాటు చేయడంటూ మద్యంప్రియులకు ఆయన వత్తాసు పలికారు. అయితే రిషికపూర్ విన్నపంపై ప్రభుత్వం ఏమేరకు స్పందిస్తుందో వేచి చూడాల్సిందే..