https://oktelugu.com/

ఐసోలేషన్ లో ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబం

గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా తో పాటు కుటుంబ సభ్యులు, సిబ్బంది మొత్తం 15 మందిని కాటూరి మెడికల్ కాలేజీ ఐసోలేషన్ వార్డ్ కి అధికారులు తరలించారు. గుంటూరు డి.ఎం అండ్ హెచ్.ఓ యాస్మిన్ కాటూరి మెడికల్ కాలేజ్ చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గుంటూరు ప్రభుత్వ వైద్యశాల వైద్య బృందం వీరికి వైద్య సేవలు అందిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే ఎమ్మెల్యే ముస్తఫా బావమరిది, పొగాకు వ్యాపారస్తుడు సుభాని ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చారు. అనంతరం ఈ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : March 29, 2020 / 01:51 PM IST
    Follow us on

    గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా తో పాటు కుటుంబ సభ్యులు, సిబ్బంది మొత్తం 15 మందిని కాటూరి మెడికల్ కాలేజీ ఐసోలేషన్ వార్డ్ కి అధికారులు తరలించారు. గుంటూరు డి.ఎం అండ్ హెచ్.ఓ యాస్మిన్ కాటూరి మెడికల్ కాలేజ్ చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గుంటూరు ప్రభుత్వ వైద్యశాల వైద్య బృందం వీరికి వైద్య సేవలు అందిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే ఎమ్మెల్యే ముస్తఫా బావమరిది, పొగాకు వ్యాపారస్తుడు సుభాని ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చారు. అనంతరం ఈ నెల 22వ తేదీన జనతా కర్ఫ్యూ నిర్వహించిన రోజున ఆయన విందు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విందులో ఎమ్మెల్యే ముస్తఫా తో పాటు మరో 200 వరకు పాల్గొన్నట్లు సమాచారం. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న సుభానిని ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు పూర్తయిన అనంతరం పాజిటివ్ అని తేలడంతో ఐసోలేషన్ లో ఉంచి చేస్తున్నారు. ఎమ్మెల్యే ముస్తఫా, ఆయన కుటుంబ సభ్యులకు కరోనా లక్షణాలు కనిపించడంతో శనివారం నగర శివారులో ఉన్న కాటూరి మెడికల్ కాలేజీకి తరలించి ఐసోలేషన్ లో ఉంచారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యే కు కరోనా వైరస్ బారినపడటం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే ముస్తఫా బావమరిది సుభాని ఇచ్చిన విందుకు హాజరైన వారందరికీ ఇప్పుడు భయాందోళన పట్టుకుంది.