Rishab Shetty- Geetha Arts: కన్నడ సినిమా ‘కాంతార’ తెలుగులోనూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ.175 కోట్లు సాధించిందని ఆ సినిమాను రిలీజ్ చేసిన అల్లు అరవింద్ స్వయంగా పేర్కొన్నాడు. ఏ భాషదైనా సినిమా బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనేది ఈ వసూళ్లకు నిదర్శనమని ఆయన సక్సెస్ మీట్ లో అన్నాడు. ఇదిలా ఉండగా ‘కాంతార’ ఆల్ ఇండియా లెవల్లో సక్సెస్ ఫుల్ గా రన్ కావడంతో ఆ సినిమా హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి పేరు పాపులర్ అయింది. దీంతో ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇందులో భాగంగా గీతా ఆర్ట్స్ బ్యానర్ కోసం పనిచేయాలని రిషబ్ శెట్టిని అడగగా వెంటనే ఓకే చెప్పినట్లు అల్లు అరవింద్ తెలిపారు. అంటే త్వరలో తెలుగులో రిషబ్ శెట్టి సినిమా ఉండే అవకాశం ఉంది.
ఏ సినిమా ఇండస్ట్రీలో చూసినా ఇప్పుుడు ‘కాంతర’ పేరే వినిపిస్తోంది. భాషతో సంబంధం లేకుండా భాక్సాపీస్ వద్ద ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన ‘కాంతార’ సొంత రాష్ట్రం కర్ణాటకలో సెప్టెంబర్లో విడుదలయింది. అక్కడ రూ.100 కోట్లకు మించి వసూళ్లు చేసి ప్రత్యేకంగా నిలిచింది. తెలుగులో అదే నెలలో 30న రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు రూ.175 కోట్లు రావడం అంటే మాములు విషయం కాదు.
‘కాంతార’ కన్నడంలో రిలీజ్ అయినప్పుడు బన్నీవాసు ఆ సినిమాను చూశాడట. ఈ సినిమాను మన బ్యానర్లో రిలీజ్ చేయాలని అల్లు అరవింద్ కు చెప్పాడట. అయితే ఈ సినిమాను బన్నీవాసు ఎందుకు చెబుతున్నాడో మొదట్లో అర్థం కాలేదట. దీంతో అల్లు అరవింద్ సినిమా చూసిన తరువాత దీనిని తెలుగు ప్రేక్షకులకు అందిస్తే మంచి అనుభూతి పొందుతారని అనుకున్నారు. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సినిమా రిలీజ్ చేసినట్లు అల్లు అరవింద్ పేర్కొన్నారు.
ఈ సినిమాతో రిషబ్ శెట్టి ఇప్పుడు తెలుగు హీరో కూడా అయిపోయాడు. దీంతో ఆయనతో కలిసి తెలుగు సినిమాలు చేయడంతో ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినట్లవుతుంది. అందుకే ఆయనతో సినిమా చేయాలని అడిగాం.. అడిగిన వెంటనే రిషబ్ శెట్టి ఒప్పుకున్నట్లు అల్లు అరవింద్ తెలిపాడు. అయితే రిషబ్ శెట్టి, హీరోగానా..? డైరెక్టర్ గానా..? అనేది చర్చనీయాంశంగా మారింది. కొన్ని వర్గాల సమాచారం ప్రకారం ఆయన గీతా ఆర్ట్స్ కు రైటర్ గా మాత్రమే పనిచేస్తారని అంటున్నారు.
గీతా ఆర్ట్స్ బ్యానర్ పై త్వరలో ఓ సినిమా రాబోతుందని, ఇందులో రామ్ చరణ్ నటిస్తారు. ఈ సినిమాకు స్క్రిప్టును రిషబ్ శెట్టి అందించి అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై చరణ్ ‘ధ్రువ’ సినిమా చేశాడు. ఇప్పుడు మరో సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం చెర్రి ట్రిపుల్ ఆర్ ప్రమోషన్లో భాగంగా జపాన్ లో ఉన్నారు. తిరిగి రాగానే ఆ సినిమా పనులు మొదలయ్యే ఛాన్సెస్ ఉంది. మరి స్టార్ హీరో చెర్రి కోసం రిషబ్ ఎలాంటి కథను అందిస్తారో చూద్దాం..