Star Heroines Real Names: రంగుల ప్రపంచం సినిమా ఇండస్ట్రీలో చాన్స్ కొట్టేయాలని చాలా మంది ఆశపడుతుంటారు. ముఖ్యంగా యువతులు హీరోయిన్ గా అవకాశం వస్తే తమ లైఫ్ సెటిలైపోతుందని ఆశిస్తారు. ఈ క్రమంలో అందాన్ని కాపాడుకుంటూ అభినయంతో మెలుగుతారు. అయితే అందానికి తగ్గట్లుగా కొందరి పేర్లు షూట్ కావు. దీంతో సినిమాల్లో వారికిచ్చే క్యారెక్టర్ ను భట్టి కొందరు డైరెక్టర్లు హీరోయిన్ల పేర్లు మార్చుతూ ఉంటారు. అవి అలాగే కంటిన్యూ అయి ఆ పేర్లతోనే పాపులర్ అయ్యారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్లు కూడా ఇలాగే తమ పేర్లు మార్చుకొని సినిమాల్లో కొనసాగారు. వాస్తవానికి వారి అసలు పేర్లు వేరే. ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరో చూద్దాం.

రాశీ:
చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి ‘శుభాకాంక్షలు’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ తరువాత స్టార్ హీరోలతో కలిసి నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఏజ్ బార్ కావడంతో సీరియల్ లో నటిస్తూ మంచి పొజిషన్లో ఉంది. వాస్తవానికి రాశి అసలు పేరు విజయలక్ష్మి. ఓ సందర్భంగా ఆమె పేరును రాశిగా మార్చారు.
శ్రీదేవి:
ఆల్ ఇండియా స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూడా చైల్డ్ ఆర్టిస్టుగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత హీరోయిన్ గా సూపర్ స్టార్ పేరు తెచ్చుకుంది. పాన్ ఇండియా లెవల్లో స్టార్ హీరోలందరి పక్కన నటించిన శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్. ఆమె చిన్నప్పుడే శ్రీదేవి అని పేరు మార్చుకుుంది.
రోజా:
ఒకప్పటి స్టార్ హీరోయిన్లలో రోజా ఒకరు. చక్కటి స్మైల్ తో.. తన నటనతో బీభత్సాన్ని సృష్టించింది. ఏ పాత్రలోనైనా ఇమిడిపోయే రోజా ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు. రోజా కూడా తన పేరు మార్చుకుంది. ఆమె అసలు పేరు శ్రీలతా రెడ్డి.
సౌందర్య:
సౌత్ ఇండియన్ మోస్ట్ బ్యూటీఫుల్ హీరోయిన్ సౌందర్య. గ్లామర్ గా లేకపోయినా స్టార్ హీరోయిన్ గా రాణించవచ్చని సౌందర్య నిరూపించింది. సౌత్ ఇండస్ట్రీతో పాటు బీ టౌన్ లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సౌందర్య అసలు పేరు సౌమ్య. కానీ ఈ విషయం ఎప్పటికీ బయటకు రాలేదు.
రంభ:
రాజేంద్రప్రసాద్ ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన రంభ రెండు దశాబ్దాల పాటు సినిమాలు చేసింది. ప్రస్తుతం పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉంది. రంభ అసలు పేరు విజయలక్ష్మి. ఆమె మొదటి సినిమా నుంచే రంభగా పాపులర్ అయింది.

జయసుధ:
సహజనటిగా పేరు తెచ్చుకున్న జయసుధ కూడా తన పేరును మార్చుకుంది. ఆమె అసలు పేరు సుజాత. మూడు తరాల ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంటున్న ఆమె ఇప్పటికీ సినిమాల్లో కొనసాగడం విశేషం.
ఆమని:
చలాకీ నటనతో మహిళా ప్రేక్షకులకు దగ్గరైన ఆమని సినిమాలంటే ఒకప్పుడు పడిచచ్చేవారు. వరుసగా ఆమె సినిమాలు హిట్టయినవి ఉన్నాయి. ప్రస్తతం కొన్ని సినిమాల్లో, సీరియళ్లలో నటిస్తున్న ఆమని అసలు పేరు మంజుల.
ఇంకా చాలా మంది హీరోయిన్లు తమ పేర్లను మార్చుకున్నారు. అయితే స్టార్ డమ్ తొందరగా రావడంతో పాటు పాపులర్ కావడానికి ఆకర్షించే పేర్లను జోడించుకున్నారు. వారి అసలు పేరుతో సినిమాల్లోకి వచ్చిన వారు చాలా తక్కువ. కొందరు హీరోలు కూడా తమ పేర్లను మార్చుకొని స్టార్లుగా మారారు.