Rishab Shetty Kantara Chapter 1: ఒక సినిమాలో హీరో గా నటించడమే చాలా పెద్ద టాస్క్, అలాంటిది హీరో గా నటిస్తూ,దర్శకత్వం కూడా వహించడం ఎంత పెద్ద టాస్క్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎంతో మంది ప్రముఖులు ఇలా చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్నారు. ఇప్పుడు ఆ ప్రముఖుల జాబితాలోకి రిషబ్ శెట్టి(Rishab Shetty) కూడా చేరిపోయాడు. ఆయన దర్శకత్వం వహిస్తూ హీరో గా చేసిన ‘కాంతారా’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మన కళ్లారా చూశాము. ఈ సినిమాలో ఆయన నటనకు నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఇక రీసెంట్ గా ఆయన హీరో గా నటిస్తూ, దర్శకత్వం వాయించిన ‘కాంతారా : ది చాప్టర్ 1′(Kantara : The Chapter 1) కూడా కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనమంతా చూశాము. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 600 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
వర్కింగ్ డేస్ లో కూడా ఈ చిత్రం డీసెంట్ స్థాయి హోల్డ్ ని చూపిస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా కోసం రిషబ్ శెట్టి ప్రాణం పెట్టి ఏ రేంజ్ లో పని చేసాడో, ముఖ్యంగా క్లైమాక్స్ షూటింగ్ సమయం లో ఎలా కాస్తడ్డాడో నిన్న ట్విట్టర్ వేదికగా అభిమానులతో కొన్ని ఫోటోలను షేర్ చేసి తన అనుభవాలను పంచుకున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశం చిత్రీకరణ గురించి చెప్పుకొస్తూ,’క్లైమాక్స్ చిత్రీకరణ సమయం లో నా కాళ్ళు ఈ విధంగా వాచిపోయాయి, శరీరం అలిసిపోయింది, ఈ స్థాయిలో కష్టపడడం వల్లే క్లైమాక్స్ ని అభిమానులు ఇంతలా ఆదరించారు. నేను నమ్మిన దైవ శక్తి కారణంగానే ఇదంతా సాధ్యమైంది. నా ఈ ప్రయాణంలో నాకు అండగా, మద్దతుగా నిల్చిన అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి.
ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే గ్రాస్ అయితే బాగానే కనిపిస్తుంది, కానీ అది బ్రేక్ ఈవెన్ అయ్యేందుకు ఏ మాత్రం సరిపోదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఇంకా 32 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. ఇది దాదాపుగా అసాధ్యం అనే చెప్పొచ్చు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రం ఫుల్ రన్ లో కేవలం 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టగలదు. అంతకు మించి రావడం అసాధ్యమని అంటున్నారు. ఎందుకంటే నిన్న నమోదైన వసూళ్లు కోటి రూపాయిలకంటే తక్కువ ఉందని సమాచారం. ఈ దీపావళి కి వరుసగా నాలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి, కాబట్టి థియేటర్స్ భారీగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. షేర్స్ ఇంకా తగ్గుతుంది, బ్రేక్ ఈవెన్ అసాధ్యం అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.