Homeఆధ్యాత్మికంUgadi Rashipalalu 2024: క్రోధినామ సంవత్సరంలో మీ రాశిఫలం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి..

Ugadi Rashipalalu 2024: క్రోధినామ సంవత్సరంలో మీ రాశిఫలం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి..

Ugadi Rashipalalu 2024: 2024 ఏప్రిల్ 9న తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈరోజే ఉగాది పర్వదినం అయినందున వేడుకలు నిర్వహించుకునేందుకు తెలుగు ప్రజలు రెడీ అవుతున్నారు. ఈ సందర్భంగా ప్రతీ ఏడాది ఉగాది రోజున సాయంత్రం పంచాంగ శ్రవణం ఉంటుంది. ఈ సమయంలో ఆయా రాశుల వారు ఈ ఏడాది ఎలా ఉంటుందోనని తెలుసుకుంటారు. ఏప్రిల్ 9న శోభకృత్ నామ సంవత్సరం నుంచి క్రోధి నామ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ఆయా రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

మేషం:
ఈ రాశివారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 3 ఉన్నాయి. ఈ ఏడాది ఈ రాశి వారికి అదృష్ట యోగం ఎక్కువగానే ఉంది. గురుగ్రహం వల్ల దన లాభం ఉంటుంది. మే వరకు కొంచెం ఒడిదొడుకులు ఎదుర్కొన్నా.. ఆ తరువాత బాగుంటుంది. ఉద్యోగులు వృత్తిలో రాణిస్తారు. రైతులకు లాభం ఉండనుంది. కల్యాణ గడియలు బలంగా ఉన్నాయి. సంతాన యోగం ఉంటుంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి.

వృషభం:
ఈ రాశివారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ పూజ్యం 7 ఉన్నాయి. ఈ ఏడాది వృషభం రాశి వారికి అదృష్ట యోగం తక్కువగానే ఉంటుంది. రాహు గ్రహం అనుకూలతతో రాజయోగం ఉంటుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. విద్యా విషయంలో గురుబలం అనుకూలంగా లేదు. ఉద్యోగులకు గుర్తింపు పెరుగుతుంది. వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. వీరు కొన్ని విషయాల్లో కష్టపడాల్సి వస్తుంది. గ్రహదోషం అధికంగా ఉంది. వాహనాలు కొనేవారికి అనుకూలం గా ఉంటుంది. అవివాహితులకు కల్యాణ ఘడియలు ఆలస్యం అవుతాయి.

మిథునం:
ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6 ఉండనున్నాయి. ఈ ఏడాది 50% అదృష్ట యోగం ఉంది. పూర్వార్ధంలో గురువు వల్ల కీర్తి వృద్ధి, విజయాలు చేకూరుతాయి. రాహు దశమంతో రాజకీయంలో సంతోషం, భోజన సౌఖ్యం, కర్మసిద్ధి, శరీర బలం ఉంటాయి. మే నెల వరకు గురుపాలం ఉండి, ఆ తర్వాత తగ్గుతుంది. వ్యాపారంలో ధన లాభం ఉంటుంది. వృత్తి నైపుణ్యంలో ఉన్నత స్థితి సాధిస్తారు. వివాహ గడియలు మే వరకు సానుకూలంగా ఉంటాయి. కష్టాలు తొలగుతాయి ఆరోగ్యం బాగుంటుంది.

కర్కాటకం:
కర్కాటం రాశి వారికి ఈ ఏడాది ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజం 6, అవమానం 6 ఉండనున్నాయి. అదృష్ట యోగం 50% ఉంది. ఈ రాశి వారికి ఏడాది కీర్తి వృద్ధి, శత్రువులపై విజయం సాధిస్తారు. మూడో రాహువు, కేతువు వల్ల ధన లాభం, ఆరోగ్య లాభం ఉంటాయి. వ్యాపారులు లాభాలను ఎక్కువగా పొందుతారు. మే నుంచి అధికంగా లాభాలు ఉంటాయి. గృహ, వాహన యోగాలు. శుభ ఫలితాలను ఉంటాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

సింహారాశి:
సింహ రాశి వారికి ఈ ఏడాది ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2 ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ ఏడాది అదృష్ట యోగం తక్కువగానే ఉంది. బృహస్పతి వల్ల మే వరకు ధన లాభం ఉంటుంది. రాహు, కేతు గ్రహాలు ఈ రాశి వారికి సహకరించే అవకాశం లేదు. వ్యాపార యోగం మే వరకే బాగుంటుంది. ఉద్యోగులు వృత్తిలో జాగ్రత్తలు పాటించాలి. సాంకేతిక లోపాలు రాకుండా చూసుకోవాలి. ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. అవివాహితులకు మే వరకు అనుకూలం. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

కన్యా రాశి:
కన్యా రాశి వారికి ఈ ఏడాది ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2 ఉంటాయి. కన్యా రాశి వారికి గురు శని గ్రహాల వల్ల 50% అదృష్టం ఉండనుంది. మే నుంచి ధన లాభం, గృహ లాభం ఉంటాయి. కొందరికి అదృష్టం ఆకస్మికంగా వస్తుంది. వ్యాపారంలో అధిక ధన లాభాలు ఉంటాయి. విదేశీ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. మే తర్వాత వివాహ యోగం ఉండనుంది. సంతానం గురించి శుభవార్త వింటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

తుల రాశి:
తులా రాశి వారికి ఏడాది ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5 ఉంటాయి. ఈ రాశి వారికి అదృష్ట యోగం 50% ఉంది. మే 5 వరకు సప్తమంలో మేష గురువు రాజ్య యోగం, ఆరోగ్యం, కార్యసిద్ధి వంటి శుభ ఫలితాలు ఉంటాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. విదేశీ ప్రయత్నాలు సఫలం అవుతాయి. తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు.

వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి ఈ ఏడాది ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5 ఉన్నాయి. ఈ రాశి వారికి కూడా 50% అదృష్ట యోగం ఉంది. ఏకాదశంలో రాహు కేతువు పశు లాభాన్ని అందిస్తాడు. ఉద్యోగంలో అధికార లాభం ఉంటుంది. వ్యాపారులు వృత్తిలో కష్టపడాల్సి వస్తుంది. పుణ్యక్షేత్రాలు దర్శనాలు ఎక్కువగా ఉంటాయి. మే తర్వాత ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఉత్తరార్థంలో కళ్యాణ ఘడియలు బాగున్నాయి.

మకర రాశి:
మకర రాశి వారికి ఏడాది ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1 ఉన్నాయి. గురు, కేతు గ్రహాల వల్ల అదృష్ట యోగం 50 శాతం అనుకూలంగా ఉంది. రాహు సౌభాగ్యంతో ఆరోగ్యం, కీర్తి ఫలితాలు ఉండనున్నాయి. ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయి. వ్యాపారులు లాభాలు ఎక్కువగా పొందుతారు. అవివాహితులకు మే తర్వాత ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కష్టాలు తొలగిపోతాయి. సంతృప్తి, మనశ్శాంతి ఉంటుంది.

ధనస్సు రాశి:
ధనస్సు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5 ఉండనున్నాయి. ఈ రాశి వారికి అదృష్ట యోగం 75% ఉండనుంది. బృహస్పతి అనుగ్రహం వల్ల విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కొత్త ప్రయత్నాలు పలిస్తాయి. వ్యాపారంలో మే వరకు లాభాలు ఉంటాయి. నూతన ఉత్తేజతో కొన్ని లక్ష్యాలను పూర్తి చేస్తారు. రుణ సమస్యలు రాకుండా జాగ్రత్త పడతారు. వివాహ ప్రయత్నాలు మేలోపు సక్సెస్ అవుతాయి. సంతృప్తికరమైన జీవితం ఉంటుంది.

కుంభ రాశి:
కుంభ రాశి వారికి ఏడాది ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం ఒకటి ఉంటాయి. ఈ ఏడాది గురు, శని, రాహు, కేతు గ్రహాలు వీరికి వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి. అయితే ఏకాగ్రతతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి. ఉద్యోగురు సకాలంలో పనిచేస్తే ఇబ్బందులు తొలిగిపోతాయి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

మీన రాశి:
మీన రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4 ఉంటాయి. ఈ రాశి వారికి ధనస్థానంలో బృహస్పతి, పూర్వర్థంలో రక్షిస్తాడు. మే వరకు వివాహ, విద్యాయోగానికి అనుకూలం. ఉద్యోగులు ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపార యోగం విశ్రమంగా ఉంటుంది. తీర్థయాత్రలు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యపరంగా శ్రద్ధ ఉంచుకోవాలి. సంతానయోగం ఉండే అవకాశం ఉంది. శని ధ్యానం చేయడం వల్ల ఏలినాటి శని నుంచి తప్పించుకునే అవకాశం ఉంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version