Nagababu Vs RGV: దర్శకుడు ఆర్జీవీ తల నరికి తెచ్చిన వాడికి కోటి రూపాయలు ఇస్తా… అని కొలికపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి టీవీ డిబేట్ లో ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. టీడీపీ సానుభూతిపరుడైన ఈ వ్యక్తి రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాపై ఫైర్ అయ్యాడు. ఆ సినిమాలో నారా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందని అతని వాదన. కొలికపూడి శ్రీనివాసరావు పబ్లిక్ లో ఉన్నామని కూడా మరిచి వివాదాస్పద కామెంట్ చేశాడు.
దీనికి స్పందనగా వర్మ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. అనంతరం మీడియాతో మాట్లాడాడు. కొలికపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యల నేపథ్యంలో నాకు ప్రాణహాని ఉంది. అతన్ని రెచ్చగొట్టి పదే పదే ఆ పదం చెప్పించిన టీవీ 5 సాంబశివరావు, ఆ సంస్థ యాజమాన్యం కూడా బాధ్యులే అని వ్యాఖ్యానించారు. ఈ వివాదంపై నటుడు, జనసేన నాయకుడు నాగబాబు కొణిదెల స్పందించారు.
ఒక వ్యక్తి తల తీస్తే కోటి రూపాయలు ఇస్తానని చెప్పడం తప్పు. దాన్ని సమర్ధించకూడదు. కానీ రామ్ గోపాల్ వర్మ సార్, ఆంధ్రప్రదేశ్ లో కానీ, భారతదేశంలో కానీ ఏ వెధవ మీకు ఎలాంటి హానీ తలపెట్టరు. ఎందుకంటే హీరో విలన్ కొట్టుకుంటూ మధ్యలో కమెడియన్ ని చంపరు. మీరు నిశ్చింతగా ఓడ్కా ఒక పెగ్గేసుకుని పడుకోండి.. అని ట్వీట్ చేశాడు.
దీనికి రామ్ గోపాల్ వర్మ కౌంటర్ ఇచ్చాడు. నాగబాబు సార్ నా కంటే పెద్ద కమెడియన్ ఎవడంటే నా సినిమాలో మీరు. మీ తమ్ముడి దగ్గర డబ్బులడుక్కుని టీ తాగి పడుకోండి సార్… అని కౌంటర్ ట్వీట్ చేశారు. రామ్ గోపాల్ వర్మ, నాగబాబు మధ్య ట్విట్టర్ వార్ రాజకీయ, సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఈ వివాదాలకు కారణమైన రామ్ గోపాల్ వర్మ వ్యూహం మూవీ డిసెంబర్ 29న విడుదల కానుంది. విడుదలయ్యాక ఇంకెన్ని వివాదాలు రాజేయనుందో చూడాలి.
సార్ నా కన్నా పెద్ద కమెడియన్ ఎవడంటే , నా సినిమాలో మీరు మీ తమ్ముడి దగ్గర డబ్బులడుక్కుని టీ తాగి పడుకోండి pic.twitter.com/RbhusBDNvf
— Ram Gopal Varma (@RGVzoomin) December 27, 2023