
ప్రపంచంలోనే పస్ట్ పెయిడ్ ట్రైలర్ అంటూ… తన కొత్త మూవీ ‘పవర్ స్టార్’ ట్రైలర్ చూడాలంటేరూ. 25 కట్టాలని అనౌన్స్ చేశాడు రామ్‌గోపాల్ వర్మ.. ఈ రోజు 11 గంటలకు ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్’ లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాడు. తీరా వర్మ రిలీజ్ చేసే కొన్ని గంటల ముందే ఆ ట్రైలర్ లీకైంది. దాంతో చేసేదేమీ లేక యూట్యూబ్‌లో హెచ్‌డీ ట్రైలర్ను రిలీజ్ చేశాడు వర్మ. ట్రైలర్ కోసం ఇప్పటికే డబ్బులు చెల్లించిన వారికి ఆ అమౌంట్ రిటర్న్ చేస్తామని ట్వీట్ చేశాడు. ట్రైలర్ లీక్ తమ టీమ్‌లోని ఒకరి పని అయి ఉంటుందని, ఆ వ్యక్తిని గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పాడు. ఇక, ఈ మూవీ ఎవరినీ ఉద్దేశించింది కాదు అని ఆర్జీవీ చెప్పినా.. ఇది వవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ తీసిందని అర్థమవుతోంది. పైగా టైటిల్ మధ్యలో గ్లాసు, ఎన్నికల తర్వాతి కథ అనే ట్యాగ్‌లైన్ ఇచ్చాడు. అచ్చం పవన్ కళ్యాణ్‌ను పోలిన ప్రధాన పాత్రధారితో రిలీజ్ చేసిన పోస్టర్లు, ‘గడ్డి తింటావా’ అనే సాంగ్ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేశాడు. దీనిపై పవన్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నా.. వర్మ తన పని తాను చేసుకుంటున్నట్టు ట్రైలర్ను చూస్తుంటే అర్థమవుతోంది. ఎలక్షన్స్ తర్వాతి పరిస్థితిని సెటైరికల్‌గా చూపించే ప్రయత్నం చేశాడు వర్మ.
Also Read: మణిరత్నం ‘నవరస’ సిరీస్‌లో తెలుగు స్టార్లు!
ఈ చిత్రం ప్రవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు అంకింతం అంటూ హీరో క్యారెక్టర్ను ప్రవన్ కళ్యాణ్ అని పరిచయం చేశాడు వర్మ. ‘ఒక్క సీటు.. ఒక్క సీటు కూడా రాలేదా ఆ’ అంటూ హీరో ఆవేదన చెందుతుంటే. పక్కన ఉన్న వ్యక్తి (నాదెండ్ల మనోహర్ను పోలిన క్యారెక్టర్) ‘ఒక్కటి వచ్చింది సార్. కానీ మీకు ఒక్కటి కూడా రాలేదు’ అని చెప్పడంతో హీరో టీవీ పగలగొట్టడం.. ‘ఒకసారి గుండెల మీద చెయ్యేసుకుని చెప్పరా! నువ్వు పవర్ స్టార్ అయ్యింది కానిస్టేబుల్ కొడుకుగానా లేదా నా తమ్ముడిగానా?’ అంటూ చిరంజీవి లుక్ లో ఉన్న వ్యక్తి డైలాగ్‌తో సెటైర్స్ బాగానే వేశాడు ఆర్జీవీ. ‘సత్య ప్రమాణకంగా చెబుతున్నాను బ్రదర్.. మీరు ఓడిపోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను’ అంటూ చంద్రబాబు లుక్ లో ఉన్న వ్యక్తి ( అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు ఫేమ్) అంటే.. మిమ్మల్ని నమ్మద్దు.. నమ్మద్దు అని చాలా మంది చెప్పారు… మీకో దండం అంటూ ప్రవర్ కళ్యాణ్ ఆ వ్యక్తిని ఇంటి నుంచి వెళ్లగొట్టడం.. త్రివిక్రమ్ లుక్‌లోని దర్శకుడిని కొట్టడం, బండ్ల గణేశ్ పాత్రధారి వచ్చి కాళ్ల మీద పడడం ఫన్నీగా ఉంది. ఇంతకీ నేను రాజకీయాల్లో ఉండాలా.? వదిలేయాలా? అని చీకట్లో కూర్చొని ప్రవన్ ఆలోచిస్తుండగా.. ముఖం కనిపించని ఓ వ్యక్తి చేతిలో బాటిల్‌తో వచ్చి అతని వెనక కూర్చోవడంతో ముగిసిన ట్రైలర్ ను.. రెండు గంట్లోనే దాదాపు 4 లక్షల మంది వీక్షించడం గమనార్హం. కాగా, ఈ మూవీని 25వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ఆర్జీవీ ప్రకటించాడు.