https://oktelugu.com/

హీరోలను ఎందుకు ప్రశ్నించరు.. నాని హీరోయిన్‌

శ్రద్ధా శ్రీనాథ్. నాని సూపర్ హిట్ మూవీ ‘జెర్సీ’లో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగు పెట్టింది. ఫస్ట్‌ మూవీతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఈ మధ్య నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘కృష్ణ అండ్ లీల’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగులో మరిన్ని ఆఫర్లు అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులకు ఓ ప్రశ్న వేసింది. హీరోలను ప్రశ్నించగలరా? అంటోంది. సోషల్‌ మీడియా వేదికగా ఓ ఆసక్తికర చర్చకు తెరలేపింది. హీరోలు పెళ్లి తర్వాత కూడా శృంగార సన్నివేశాల్లో నటిస్తుంటారు. అలాగే పాత్రల […]

Written By: , Updated On : July 10, 2020 / 05:03 PM IST
Follow us on


శ్రద్ధా శ్రీనాథ్. నాని సూపర్ హిట్ మూవీ ‘జెర్సీ’లో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగు పెట్టింది. ఫస్ట్‌ మూవీతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఈ మధ్య నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘కృష్ణ అండ్ లీల’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగులో మరిన్ని ఆఫర్లు అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులకు ఓ ప్రశ్న వేసింది. హీరోలను ప్రశ్నించగలరా? అంటోంది. సోషల్‌ మీడియా వేదికగా ఓ ఆసక్తికర చర్చకు తెరలేపింది. హీరోలు పెళ్లి తర్వాత కూడా శృంగార సన్నివేశాల్లో నటిస్తుంటారు. అలాగే పాత్రల ఎంపిక విషయంలోనూ ఎలాంటి మార్పూ అవసరంలేదు. కానీ హీరోయిన్ల పరిస్థితి వేరు. మ్యారేజ్‌ అయితే చాన్స్‌లు తగ్గిపోతాయి. సమంతా లాంటి ఒకరిద్దరిని మినహాయిస్తే చాన్స్‌లు రావన్న భయంతో చాలా మంది హీరోయిన్లు తమ పెళ్లిని వాయిదా వేసుకుంటున్నారు. అలాగే పెళ్లయ్యాక రొమాంటిక్ సీన్స్‌లో నటిస్తే చాలా మంది విమర్శకులు తమ గొంతు సవరిస్తారు. పెళ్లాయ్యాక అలాంటి సీన్స్‌ అవసరమా అంటారు.

టీడీపీ ట్రాప్లో వైసీపీ నేతలు పడ్డారు?

దీన్ని శ్రద్ధా శ్రీనాథ్‌ తప్పుపడుతోంది. ‘పెళ్లయ్యాక హీరోయిన్‌కి నిజంగానే డిమాండ్‌ తగ్గుతుందా? మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను’ అని ఫ్యాన్స్‌ను కోరింది.ఇది పది మార్కుల ప్రశ్న. దయచేసి చర్చించండి అని రిక్వెస్ట్‌ చేసింది. దానికి కారణం ఏమిటో కూడా ఆమె వివరించింది. తన స్నేహితురాలైన ఓ నటి త్వరలో పెళ్లి చేసుకోబోతోందని తెలిసి ఇండస్ట్రికి చెందిన ఓ వ్యక్తి పెళ్లి తర్వాత కూడా ఆమె నటిస్తుందా అని చాలా నిర్లక్ష్యంగా తనను అడిగాడని చెప్పింది. ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోవడంతో పాటు, చాలా కోపం వచ్చిందని తెలిపింది. అలాగే ఆ ప్రశ్న తనను ఆలోచనలో పడేసిందని, వివాహం అయిన నటులు రొమాంటిక్‌ సీన్స్‌లో నటిస్తున్నారు కదా? అలాంటి ప్రశ్నలు వారిని ఎందుకు అడగరో అర్థం కావడం లేదు అని చెప్పింది. ఈ విషయం గురించి మీ స్పందన తెలుసుకోవాలనుకుంటున్నా అని సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ను అడిగింది. ఆమె పోస్ట్‌కి పలువురు ఫాలోయర్స్‌ స్పందించారు. ‘మీరు చెప్పింది కరెక్ట్‌. హీరోలకి ఒక న్యాయం.. హీరోయిన్లకి ఒక న్యాయమా?’ అని అంటున్నారు.