Homeఎంటర్టైన్మెంట్RGV: ఆర్జీవీ మాములోడు కాదు.. మంత్రి పేర్నినాని అపాయింట్ మెంట్ దొరికిందిగా..!

RGV: ఆర్జీవీ మాములోడు కాదు.. మంత్రి పేర్నినాని అపాయింట్ మెంట్ దొరికిందిగా..!

RGV: ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు విషయంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఓ వైపు సినీ పెద్దలు ఈ విషయంపై నేరుగా స్పందించకున్నా పరోక్షంగా ఏదో ఒక కామెంట్ చేసి సైలంట్‌గా ఉంటున్నారు. ఇప్పటివరకు ఈ విషయంపై నేరుగా స్పందించిన వారిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు నేచురల్ స్టార్ నాని మాత్రమే ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో తాను పెద్దమనిషి పెత్తనం ఎత్తుకోబోనని మీడియా ముఖంగా ప్రకటించారు. ఇక నందమూరి కుటుంబం, అక్కినేని, దగ్గుబాటి కుటుంబం ఇలా ఎవరూ స్పందించలేదు. కానీ, ఆర్జీవీ మాత్రం సినిమా టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించారని చెప్పుకోవచ్చు.

RGV Perni Nani
RGV Perni Nani

వారం రోజులుగా సినిమా టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వంతో పెద్ద రచ్చకు తెరలేపారు. అటు మీడియా, సోషల్ మీడియా వేదికగా ఏపీ మంత్రులు పేర్నినాని, కొడాలి నాని, అనిల్ కుమార్ ‌లకు పంచులు వేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే మంత్రి పేర్నినానికి వర్మ పది సూటి ప్రశ్నలు వేశారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య చిన్నపాటి ట్వీట్ల యుద్దమే జరిగింది. చివరగా ప్రభుత్వంతో గొడవపడాలనేది తన అభిమతం కాదని, అనుమతిస్తే కలుస్తానని ఆర్జీవీ మంత్రి పేర్ని నానిని కోరారు.

దీనిపై స్పందించిన మంత్రి ‘త్వరలోనే కలుద్దాం’ అని నాని ఇటీవల రిప్లై ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే తనకు పేర్ని నాని నుంచి పిలుపు వచ్చిందని ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా అభిమానులకు తెలియజేశాడు. సినిమా టికెట్‌ ధరల విషయంపై చర్చించేందుకు తనను ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని ఆహ్వానించారని రామ్‌గోపాల్‌ వర్మ తన ఖాతాలో పోస్ట్‌ చేశారు. అమరావతి సచివాలయంలో జనవరి 10న మధ్యాహ్నం భేటీ కాబోతున్నట్టు వివరించారు.

Also Read: Ashu Reddy: అషురెడ్డికి షాకిచ్చిన అసిస్టెంట్.. ఫొటోల బండారం బట్టబయలు..!

తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు మంత్రి పేర్ని నానికి ఆర్జీవీ ధన్యవాదాలు తెలిపారు. కాగా, వీరిద్ధరి మధ్య ఎటువంటి చర్చ నడవబోతోందనేది ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. వర్మ సినిమా ఇండస్ట్రీ బాగుకోసం ఏయే అంశాలను పేర్ని నాని దృష్టికి తీసుకెళ్లబోతున్నారని టాలీవుడ్ పెద్దలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట.. అయితే, ఆర్జీవీ ఒంటరిగా వెళ్తారా? లేకపోతే ఇండస్ట్రీలో పేరున్న ప్రముఖులను ఎవరినైనా తీసుకెళ్తారా? అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Tollywood: ఏపీ ప్రభుత్వం అలా చేసి చూపించాలంటూ ఛాలెంజ్ చేస్తున్న ఆర్జీవి… దాని గురించేనా ?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Exit mobile version