Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ దేశవ్యాప్తంగా కూడా పరిచయం అవసరం లేని పేరు. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల పరంగా వార్తల్లో ఉండే దాని కంటే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో ఉండేది ఎక్కువనే చెప్పాలి. పబ్లిసిటీ కోసం సోషల్ మీడియాని ఆర్జీవి ఉపయోగించుకునేంతలా వేరెవరు ఉపయోగించుకోలేరంటే అది అతిశయోక్తి కాదు. అప్పట్లో మంచి డైరెక్టర్ గా గుర్తింపు పొందిన ఆర్జీవి… ప్రస్తుతం విభిన్నమైన కథలు తీస్తున్న ప్రజలను మెప్పించడంలో విఫలమవుతున్నారని చెప్పాలి. అయితే తాజాగా మా ఎన్నికలపై ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

సినిమా నటీనటులు తాము నిజమైన సర్కస్ వాళ్లమని ప్రేక్షకులను మా ఎన్నికలు ద్వారా రుజువు చేశారని ఆర్జీవి ట్వీట్ చేశారు. ‘మా’ పై తనదైన శైలిలో కౌతర్లు వేసి… ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు ఆర్జీవి. అయితే ఆర్జివి మా ఎన్నికలలో కౌంటర్ల తీరును గమనించినట్లయితే ప్రకాష్ రాజ్ కి తన మద్దతు ఇండైరెక్ట్ గా మద్దతు తెలుపుతున్నట్లు అర్థమవుతుంది.
Cine”MAA”people proved to the audience, that they are actually a CIRCUS 😳😳😳😳
— Ram Gopal Varma (@RGVzoomin) October 16, 2021
ఈ మధ్య కాలంలో తెలుగు చిత్రా పరిశ్రమలో మా ఎన్నికలు చర్చకెక్కినట్లు మరే విషయం అంతలా హాట్ టాపిక్ గా మారలేదు. ఈ ఎన్నికలలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీ చేయగా మంచు విష్ణు విజయం సాధించారు. అయితే తాజాగా మంచు విష్ణు ప్యానెల్ నుంచి గెలిచిన సభ్యులంతా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇది ఇలా ఉండగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయకుండా మా అసోసియేషన్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ‘మా’ అధ్యక్షుడైన మంచు విష్ణు ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులకు ఇది తగదు అని… ఎటువంటి ఆటంకాలు లేకుండా ‘మా’ సాగుతుందని సమాధానమిచ్చారు.