VP Khalid Passess Away: మలయాళ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ నటుడు వీపీ ఖలీద్ హఠాన్మరణం పొందారు. 70 ఏళ్ల ఖలీద్ షూటింగ్ సెట్స్ లోనే ప్రాణాలు విడిచారు. ఖలీద్ మృతితో మాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మిన్నల్ మురళి ఫేమ్ టోవినో థామస్ హీరోగా జాడే జోసెఫ్ ఆంటోని దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతుంది. వైకోమ్ అనే పట్టణంలో మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీలో ఖలీద్ నటిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో ఖలీద్ పాల్గొన్నారు.

సెట్స్ లో బ్రేక్ పాస్ట్ చేసిన ఖలీద్ వాష్ రూమ్ కి వెళ్లారు. ఎంత సేపటికీ ఆయన బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి చూడగా… అక్కడే ఆయన చలనం లేకుండా పడి ఉన్నారు. షాక్ కి గురైన చిత్ర యూనిట్ దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఖలీద్ మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన మరణానికి కారణం గుండెపోటని వైద్యులు నిర్ధారించారు. ఖలీద్ మరణవార్త తెలుసుకున్న చిత్ర ప్రముఖులు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.
Also Read: RGV Tweet On Draupadi Murmu: అడుసు తొక్కనేల కాలు కడగనేల… ఆమెను అవమానించాలనే ఉద్దేశం లేదంటూ ట్వీట్!

రంగస్థల నటుడిగా ఖలీద్ ప్రస్థానం మొదలైంది. ఆయన ప్రతిభను గుర్తించిన దర్శక నిర్మాతలు సినిమా అవకాశాలు ఇచ్చారు. చాలా కాలంగా ఆయన నటుడిగా కొనసాగుతున్నారు. అనేక సినిమాల్లో, టివి సీరియల్స్ లో నటించి పాపులర్ అయ్యారు. వీపీ ఖలీద్ కి ముగ్గురు కుమారులు. శైజు, జింశి, అలాగే దర్శకుడు ఖలీద్ రెహ్మాన్. ముగ్గురూ ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు. నేడు ఆయన అంత్యక్రియలు కుటుంబ సభ్యులు నేడు నిర్వహించనున్నారు.
Also Read:Pushpa 2: షాకింగ్: పుష్ప2లో అల్లు అర్జున్ ‘తగ్గేదే లే’ ఉండదట?
Recommended Videos
[…] […]