https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8 లోకి గెస్ట్ గా ఎంట్రీ ఇస్తున్న ఆర్జీవీ…ఇక ఆట మామూలుగా ఉండదు…

ప్రస్తుతం బిగ్ బాస్ షో చేస్తున్న మ్యాజిక్ గురించి మనం ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు...ఇక ఈ సీజన్ స్టార్ట్ అయి 10 రోజులే అవుతున్నప్పటికీ యూత్ లో ఈ సీజన్ భారీ క్రేజ్ ను సంపాదించుకుంది...

Written By:
  • Gopi
  • , Updated On : September 11, 2024 / 12:19 PM IST

    Bigg Boss 8 Telugu(35)

    Follow us on

    Bigg Boss 8 Telugu: ప్రస్తుతం బుల్లితెర మీద సందడి చేస్తున్న షో లలో బిగ్ బాస్ మొదటి స్థానం లో ఉంది. ఇక ఇప్పటికే 7 సీజన్లను కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్..రీసెంట్ గా ఎనిమిదవ సీజన్ కూడా స్టార్ట్ అయింది. ఇక నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో కంటెస్టెంట్స్ తమదైన రీతిలో పాల్గొని బిగ్ బాస్ నిర్వహించే టాస్కులను చాలా బాగా ఆడుతూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ముఖ్యంగా శేఖర్ భాషా,అభయ్ నవీన్,ఆదిత్య ఓం, కిర్రాక్ సీత, నవీల్ అఫ్రిది, నైనిక, పృధ్వీ రాజ్ శెట్టి, విష్ణు ప్రియ, నిఖిల్, సోనియా ఆకుల, యశ్మి గౌడ, ప్రేరణ కభం,నాగ మణికంఠ లాంటి కంటెస్టెంట్లు తమదైన ఆట తీరుతో ఎవరికి వారు ప్రేక్షకులను మెప్పించే విధంగా ముందుకు సాగుతున్నారు. ఇక ఇదిలా ఉంటే బిగ్ బా లోకి వచ్చిన మొదటి వారంలోనే ‘బెజవాడ బెబక్క’ ఎలిమినేట్ అవ్వడం అనేది కొంతమంది అభిమానులను తీవ్రమైన కలవరానికి గురి చేసిందనే చెప్పాలి. ఇక బిగ్ బాస్ గత సీజన్ తో పోల్చుకుంటే ఈ సీజన్ కి అంత మంచి క్రేజ్ అయితే దక్కడం లేదు. కానీ యాజమాన్యం మాత్రం ఎలాగైనా సరే బిగ్ బాస్ మీద ప్రేక్షకుల్లో అటెన్షన్ ని క్రియేట్ చేసే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.

    ఇక అందులో భాగంగానే రెండు వారాలు ముగిసిన తర్వాత తెలుగులో సంచలన దర్శకుడిగా గుర్తింపు పొందిన ఆర్జీవి ని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ చేయాలనే ఉద్దేశంలో బిగ్ బాస్ యాజమాన్యం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే షో మేనేజ్ మెంట్ రామ్ గోపాల్ వర్మతో సంప్రదింపులు కూడా జరిపినట్టుగా తెలుస్తోంది.

    సాధారణంగా ఆర్జీవీ టీవీ షోలోకి వచ్చి మాట్లాడితేనే యావత్ తెలుగు యువత మొత్తం ఊగిపోతూ ఉంటారు. అలాంటిది బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే మాత్రం పెను సంచలనమే జరుగుతుంది. ఇక కొద్ది రోజులపాటు ఆ హౌజ్ లోనే ఉండి అక్కడ జరిగే పరిణామాలకు ఆయన రెస్పాండ్ అయ్యే విధానం చూడడానికి అభిమానులతో పాటు, సగటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆర్జీవి రాకతో బిగ్ బాస్ టిఆర్పి రేటింగ్ కూడా భారీగా పెరగబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి అందుతున్న సమాచారం ప్రకారం అయితే రెండు వారాలు ముగిసిన తర్వాత ఆర్జీవి వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.

    ఆర్జీవీ నిజంగానే వస్తాడా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ న్యూస్ మీద పలు రకాల కథనాలైతే వెలువడుతున్నాయి. మరి వాటిని బట్టి చూస్తే ఆర్జీవీ తప్పకుండా బిగ్ బాస్ షో లో పాల్గొనబోతున్నాడు అనేది చాలా క్లియర్ కట్ గా తెలుస్తోంది. చూడాలి మరి వర్మ ఈ షో లోకి వస్తాడా? రాడా అనేదే…