Homeఎంటర్టైన్మెంట్Wives of Top Comedians: మన టాలీవుడ్ కమెడియన్స్ ల సతీమణులని చూసారా ? వారికి...

Wives of Top Comedians: మన టాలీవుడ్ కమెడియన్స్ ల సతీమణులని చూసారా ? వారికి ఎంత మంది సంతానమో మీకు తెలుసా?

Wives of Top Comedians: నవరసాల్లో హస్యం ఒక రసం అయినప్పటికీ దానికి అన్నిటి కంటే ఎక్కువ ప్రయారిటీ ఉంటుందని పెద్దలు చెప్తుంటారు. అలా సినిమాల్లోనూ హాస్యరసం అనేది కంపల్సరీ ప్యారామీటర్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంటర్ టైన్మెంట్ అందించే మీడియం చిత్రం అని పలువురు పేర్కొంటుంటారు కూడా. ఈ సంగతులు అలా ఉంచితే.. పిక్చర్స్‌లో హాస్య నటులుకు ఉండే ప్రాధాన్యత అందరికీ తెలుసు. సినిమాను ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి తీసుకెళ్లడంలో వారు ప్రత్యేకత కలిగి ఉంటారు. ఈ సంగతులు అలా ఉంచితే.. మనకున్న టాప్ కమెడియన్స్ వ్యక్తిగత జీవితం, వారి భార్యా, పిల్లల గురించి అందరికీ తెలిసి ఉండదు. ఈ క్రమంలోనే వారి గురించి స్పెషల్ స్టోరి..

Wives of Top Comedians
Comedian Sunil Family

టాప్ కమెడియన్ సునీల్ ప్రజెంట్ విలన్‌గానూ రాణిస్తున్నాడు. హీరోగానూ పలు సినిమాలు చేశాడు సునీల్. దాదాపు 170 సినిమాలలో కమెడియన్ రోల్ ప్లే చేసిన సునీల్..తన యాక్టింగ్‌కు గాను నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డ్సు అందుకున్నాడు. సునీల్ 2002లో శ్రుతి అనే అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక ఒక కూతురు ఉంది.. ఇక లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం..1,000 చిత్రాల్లో నటించి గిన్నిస్ రికార్డుకెక్కారు. ఈయన భార్య పేరు లక్ష్మి కాగా, వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

Wives of Top Comedians
Comedian Ali Family

Also Read: స్టార్ హీరోలకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఇవే..!

మరో స్టార్ కమెడియన్ ఆలీ సైతం 1,000 ఫిల్మ్స్‌లో నటించాడు. హీరోగా 55 చిత్రాలు చేసిన ఆలీ.. కమెడియన్‌గానూ రాణిస్తున్నారు. ఆలీ వైఫ్ పేరు జుబేరా సుల్తానా బేగం. కాగా, వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. మరో కమెడియన్ రఘు కారుమంచి పలు సినిమాల్లో నటించడంతో పాటు ‘జబర్దస్త్’లోనూ యాక్ట్ చేశాడు. ఈయనకు ఇద్దరు కూతుర్లున్నారు.

కమెడియన్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ , రైటర్ అయిన పోసాని కృష్ణమురళి సినిమాలోని 24 క్రాఫ్ట్స్ పైన పట్టున్న వ్యక్తి. ఈయన భార్య పేరు కుసుమలత. కమెడియన్ ‘సత్యం’ రాజేశ్ ‘సత్యం’ సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు. ఈయన భార్య పేరు పల్లవి. మరో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి భార్య పేరు స్వాతిరెడ్డి. కాగా, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Also Read: ‘టికెట్‌ ధరల’ పై ఆర్జీవీ లోతైన విశ్లేషణలు !

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Exit mobile version