https://oktelugu.com/

అరియానపై మరోసారి ఆర్జీవీ హాట్ కామెంట్స్

రాంగోపాల్ వర్మ అంటేనే వివాదాస్పద తిక్క దర్శకుడు అన్న పేరుంది. ఆయన కౌంటర్లు, సెటైర్లు చూస్తే ఇంటర్వ్యూ చేయడానికి పెద్ద జర్నలిస్టులే తటపటాయిస్తుంటారు. కానీ బిగ్ బాస్ ఫేమ్, సోషల్ మీడియా యాంకర్ అరియానా మాత్రం అలాంటివేవీ పెట్టుకోకుండా అంతే హాట్ గా రాంగోపాల్ వర్మను గతంలో ఇంటర్వ్యూ చేసింది. ఫుల్ పాపులర్ అయ్యింది. ఆ ఇంటర్వ్యూతోనే అరియానకు బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది. ఆ తర్వాత తన ప్రవర్తన, క్రేజ్ తో బిగ్ బాస్ […]

Written By:
  • NARESH
  • , Updated On : June 18, 2021 / 09:07 AM IST
    Follow us on

    రాంగోపాల్ వర్మ అంటేనే వివాదాస్పద తిక్క దర్శకుడు అన్న పేరుంది. ఆయన కౌంటర్లు, సెటైర్లు చూస్తే ఇంటర్వ్యూ చేయడానికి పెద్ద జర్నలిస్టులే తటపటాయిస్తుంటారు. కానీ బిగ్ బాస్ ఫేమ్, సోషల్ మీడియా యాంకర్ అరియానా మాత్రం అలాంటివేవీ పెట్టుకోకుండా అంతే హాట్ గా రాంగోపాల్ వర్మను గతంలో ఇంటర్వ్యూ చేసింది. ఫుల్ పాపులర్ అయ్యింది.

    ఆ ఇంటర్వ్యూతోనే అరియానకు బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది. ఆ తర్వాత తన ప్రవర్తన, క్రేజ్ తో బిగ్ బాస్ ఫైనలిస్టుగా మారింది. అయితే బిగ్ బాస్ ను వచ్చాక మరింతగా పాపులర్ అయిన అరియానా తాజాగా మరోసారి ఆర్జీవీని కలిసింది. ఆర్జీవీతో హాట్ హాట్ గా జిమ్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

    అయితే వర్మతో అంత క్లోజ్ గా అరియానా జిమ్ ఎందుకు చేసిందా? అన్న డౌట్ అందరికీ వచ్చేసింది. దీనిపై తాజాగా వర్మ క్లారిటీ ఇచ్చేశాడు. వర్మతో అరియానా వినూత్న, సంచలన ఇంటర్వ్యూ చేసిందట.. అలా షార్ట్ దుస్తులతో జిమ్ చేస్తూ వర్మను హాట్ హాట్ ప్రశ్నలు అడిగిందట..

    అయితే ఆ ఇంటర్వ్యూ జరిగి చాలా రోజులైనా వర్మ విడుదల చేయలేదు. అరియానా చప్పుడు చేయలేదు. దీంతో తాజాగా వర్మ ట్వీట్ చేశాడు. ‘సారీ అరియానా. నువ్వు చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ సాంకేతిక లోపం వల్ల విడుదల ఆలస్యమైంది. ఈరోజు రాత్రి 9.30కి టీజర్ విడుదల చేస్తున్నాం’ అంటూ క్షమించాలని అరియానాను వర్మ కోరడం విశేషం. ఇప్పుడీ టీజర్ కథపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.