https://oktelugu.com/

టిక్ టాక్ పోరికి వర్మ బంపర్ ఆఫర్

టిక్ టిక్ వీడియోలు చేసే ఓ యువతికి డైరెక్టర్ వర్మ బంపరాఫర్ ఇచ్చాడు. ఓ యువతి టిక్ టాక్ వర్మ డైలాగ్స్ తో టిక్ టిక్ చేసి పోస్టు చేసింది. ఇది చూసిన వర్మ ఆ యువతికి ఫిదా అయ్యాడు. సినిమాల్లో నటించాలనుకుంటే ఛాన్స్ ఇస్తానంటూ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. అయితే దీనిపై ఆ యువతి ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి మరీ.. డైరెక్టర్ వర్మ రూటే సపరేట్ గా ఉంటుంది. సమాజంలో ఉండే వివాదాలనే వర్మ తన […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 15, 2020 / 04:43 PM IST
    Follow us on


    టిక్ టిక్ వీడియోలు చేసే ఓ యువతికి డైరెక్టర్ వర్మ బంపరాఫర్ ఇచ్చాడు. ఓ యువతి టిక్ టాక్ వర్మ డైలాగ్స్ తో టిక్ టిక్ చేసి పోస్టు చేసింది. ఇది చూసిన వర్మ ఆ యువతికి ఫిదా అయ్యాడు. సినిమాల్లో నటించాలనుకుంటే ఛాన్స్ ఇస్తానంటూ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. అయితే దీనిపై ఆ యువతి ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి మరీ..

    డైరెక్టర్ వర్మ రూటే సపరేట్ గా ఉంటుంది. సమాజంలో ఉండే వివాదాలనే వర్మ తన పబ్లిసిటీకి వాడుకుంటుంటాడు. తన సినిమాలను ఫ్రీ పబ్లిసిటీ చేసుకోవడం వర్మ స్టైలే వేరు. అంతేకాకుండా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వివాదాస్పద వ్యాఖలతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటుంటాడు. వర్శకు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో.. అలాగే అతడిని వ్యతిరేకించే వర్గం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. తాజాగా వర్శ డైలాగ్ లతో ఓ అందమైన యువతి చేసిన వీడియోను తన ట్వీటర్లో పోస్టు చేశాడు. ‘నీకు సినిమాల్లో నటించే ఇంట్రెస్ట్ ఉంటే.. వెంటనే మీ డిటైల్స్ పంపించండి’ అంటూ ఓ మెయిల్ ఐడీ అడ్రస్ ఇచ్చాడు. ఈ అమ్మాయికి వర్మ అంతా ఫిదా అవడం ఆసక్తిని రేపుతోంది.

    దీనిపై పలువురు నెటిజన్లు వారివారి స్టైల్లో కామెంట్స్ పెడుతున్నారు. వర్మకు ఫ్యూచర్ స్టార్ దొరికిందంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు నెటిజన్లు తమకు కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. డైరెక్టర్ వర్మ ఇచ్చిన బంపరాఫర్ పై ఆ యువతి ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.