https://oktelugu.com/

మళ్ళీ విరాళానికి రెడీ అవుతున్న రాఘవ లారెన్స్

డ్యాన్స్ మాస్టర్ స్థాయి నుంచి యాక్టర్ గా మారి ఆ తరవాత డైరెక్టర్ గా మారిన రాఘవ లారెన్స్ కి వ్యక్తిగా చాలా మంచి పేరుంది. అతను సినిమాల్లో సంపాదన మొదలెట్టిన దగ్గరనుంచి సేవా కార్యక్రమాలు చే్స్తున్నాడు. వికలాంగులతో పాటు అభాగ్యులెందరినో ఆదుకున్నాడు. తాజాగా కరోనా సహాయ నిధికి కూడా మూడు కోట్ల భారీ విరాళం ఇచ్చాడు . ఇపుడు మళ్ళీ ఇస్తానంటున్నాడు . కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా విరాళం ప్రకటించినపుడు రాఘవ లారెన్స్ మూడు […]

Written By: , Updated On : April 15, 2020 / 04:43 PM IST
Follow us on


డ్యాన్స్ మాస్టర్ స్థాయి నుంచి యాక్టర్ గా మారి ఆ తరవాత డైరెక్టర్ గా మారిన రాఘవ లారెన్స్ కి వ్యక్తిగా చాలా మంచి పేరుంది. అతను సినిమాల్లో సంపాదన మొదలెట్టిన దగ్గరనుంచి సేవా కార్యక్రమాలు చే్స్తున్నాడు. వికలాంగులతో పాటు అభాగ్యులెందరినో ఆదుకున్నాడు. తాజాగా కరోనా సహాయ నిధికి కూడా మూడు కోట్ల భారీ విరాళం ఇచ్చాడు . ఇపుడు మళ్ళీ ఇస్తానంటున్నాడు .

కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా విరాళం ప్రకటించినపుడు రాఘవ లారెన్స్ మూడు కోట్ల విరాళం గురించి చెబుతూ.. అది సన్ పిక్చర్స్ వాళ్లు చంద్రముఖి-2 కోసం ఇచ్చిన అడ్వాన్స్ అని చెప్పడం లారెన్స్ నిజాయితీకి అద్దం పట్టింది. రజనీకాంత్ వీర అభిమాని అయిన లారెన్స్ తాను మూడు కోట్ల విరాళం ప్రకటించాక తనకు సినీ పరిశ్రమ నుంచి ఇంకెంతోమంది ఫోన్లు చేశారని.. అనేకమంది తమ సమస్యలు చెబుతూ ఫొటోలు, వీడియోలు పంపారని.. తమకు సాయం చేయమని కోరారని.. ఐతే తాను వాళ్లందరికీ సాయం చేసే పరిస్థితుల్లో లేనని భావించి తన అసిస్టెంట్లకు చెప్పి తాను బిజీ అని చెప్పమని సైలెంటుగా ఉండిపోయానని.. కానీ లోపల గదిలోకి వెళ్లి పడుకుంటే వాళ్ల కష్టాలే గుర్తుకొచ్చాయని.. తనకు నిద్ర పట్టలేదని.. దీంతో మరింతగా తాను సాయం చేయాల్సిన అవసరం ఉందనిపించిందని.. దీనిపై తన ఆడిటర్తో మాట్లాడుతున్నా అని.. దీనిపై రాబోయే శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రకటన చేస్తానని అన్నాడు లారెన్స్.