
వివాదాస్పద కామెంట్స్ తో ఏదొక రకంగా దర్శకుడిగా నెట్టుకొస్తోన్న రాంగోపాల్ వర్మ మళ్లీ పేలారు. బాలయ్య గళం పై వర్మ కామెడీ చేశారు. బాలయ్య ఆ మధ్య పాట పాడిన యవ్వారం తెలిసిందే. అయితే బాలయ్య పాడిన పాట పై మీ అభిప్రాయం ఏంటి? అని ‘జీవి కానీ ఆర్జీవీ’ని అడిగితే.. తనదైన శైలిలో రెచ్చిపోతూ.. ‘ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. సింగింగ్ కని బెట్టిన తర్వాత ప్రపంచ చరిత్రలో నేను చూసిన అత్యుత్తమమైన గాయకుడు బాలయ్య బాబు’ అంటూ ఎంత ఎగతాళి చేయాలో అంతకన్నా ఎక్కువ వెటకారం చేసేశాడు వర్మ.
మరి నటసింహ నందమూరి బాలకృష్ణ తన 60వ జన్మదినం సందర్భంగా ప్రేక్షకాభిమానులను అలరించడానికి పాడిన పాట పై వర్మ కామెంట్స్ బాలయ్యకు చేరితే ఆయన ఎలా స్పందిస్తారో.. బాలయ్య అభిమానులు మాత్రం ఆయన పాడిన పాటను బాగానే ఎంజాయ్ చేశారు.
ఏమైనా బాలయ్య సినిమాలతో పాటు ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ పనులతో పాటు, బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్విర్తిస్తూ బిజీ బిజీగా ఉంటూ ఒక పాట పాడితే వర్మ లాంటి వాళ్లు ఇలా కామెంట్స్ చేస్తే బాలయ్య మనసు ఎంత బాధ పడుతుంది. పాపం బాలయ్య.