https://oktelugu.com/

బాలీవుడ్ లో హీరోయిన్లకే ఎక్కువ మగతనం : వర్మ

రాంగోపాల్‌ వర్మ అంటేనే సెన్సేషన్‌.. సెన్సేషన్‌ అంటే వర్మ. వివాదాలకు కేరాఫ్​ అడ్రస్‌ వర్మ. తను పట్టిన కోడికి నాలుగు కాళ్లు ఉంటాయంటాడు. ఎవరు ఏం వాదించినా లైట్‌గా తీసుకుంటాడు. వివాదస్పదమైన సినిమాలూ తీస్తుంటాడు. అదే స్థాయిలో రచ్చ చేసే ట్వీట్లూ చేస్తుంటాడు. Also Read: హీరోయిన్ తో విడాకులు.. ఇంకా వెంటాడుతున్నాయి ! బాలీవుడ్‌ హీరో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ చనిపోయిన తర్వాత ఆయన గర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తి పైనే అందరూ అనుమానాలు వ్యక్తం చేశారు. (ఇప్పుడు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 4, 2020 / 07:02 PM IST
    Follow us on


    రాంగోపాల్‌ వర్మ అంటేనే సెన్సేషన్‌.. సెన్సేషన్‌ అంటే వర్మ. వివాదాలకు కేరాఫ్​ అడ్రస్‌ వర్మ. తను పట్టిన కోడికి నాలుగు కాళ్లు ఉంటాయంటాడు. ఎవరు ఏం వాదించినా లైట్‌గా తీసుకుంటాడు. వివాదస్పదమైన సినిమాలూ తీస్తుంటాడు. అదే స్థాయిలో రచ్చ చేసే ట్వీట్లూ చేస్తుంటాడు.

    Also Read: హీరోయిన్ తో విడాకులు.. ఇంకా వెంటాడుతున్నాయి !

    బాలీవుడ్‌ హీరో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ చనిపోయిన తర్వాత ఆయన గర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తి పైనే అందరూ అనుమానాలు వ్యక్తం చేశారు. (ఇప్పుడు దర్యాప్తు కూడా అదే కోణంలో జరుగుతోందనుకోండి.) ఈ కేసులో రియా తప్పులేదంటే ముందు నుంచీ ఆమెకు అండగా నిలుస్తూ ట్వీట్లు చేస్తున్న వారిలో ముందు వరుసలో ఉంటారు వర్మ. ఈ కేసులో మీడియానే ట్రయల్స్‌ చేయడంపై అసంతృప్తిని కూడా వెలిబుచ్చాడు. ఈ విషయంపై బాలీవుడ్ హీరోలు స్పందించకపోవడంపై కూడా ఆర్జీవి తప్పుపట్టాడు. ఈ క్రమంలో మరోసారి వర్మ చేసిన ట్వీట్లు చర్చనీయాంశమయ్యాయి.

    సుశాంత్‌ మరణంపై న్యాయం కావాలని కోరుతూ అమెరికాలో ప్రకటన బిల్‌ బోర్డుపై ‘Justice for Sushanth Singh Rajput’ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ బిల్‌ బోర్డును తొలగించడంపై రాంగోపాల్‌ వర్మ స్పందించాడు. ‘ఎట్టకేలకు ఈ కేసు విచారణ పారదర్శకతలో జరుగుతోంది. న్యాయం ఎప్పటికైనా నిలుస్తుందనే ఫీలింగ్‌ కలుగుతోంది. రియా చక్రవర్తికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారానికి సంబంధించిన సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ బిల్‌బోర్డును అమెరికాలో తొలగించారు’ అనే విషయాన్ని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    Also Read: సవతులుగా మారనున్న వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, ఐశ్వర్య రాజేష్ !

    ఇక సుశాంత్ సింగ్ కేసులో మీడియా అందరూ కలిసి రియా చక్రవర్తిని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా రియాకు మద్దతుగా నిలిచిన తాప్సీ, విద్యాబాలన్, శిభానీ దండేకర్, మంచు లక్ష్మీ, స్వరభాస్కర్ ధైర్యానికి మెచ్చుకోవాలని వర్మ అన్నారు. బాలీవుడ్ లో మగాళ్ల కంటే ఈ బాలీవుడ్ మహిళలకే ఎక్కువ మగతనం ఉందనే విషయాన్ని రుజువు చేశారని వర్మ ట్వీట్ చేశారు.