Bigg Boss 6 Telugu- Revanth: భారీ అంచనాల నడుమ అట్టహాసంగా ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 6 ఊహించని మలుపులతో, ఆసక్తికరమైన టాస్కులతో ఇంటి సభ్యుల భావోద్వేగాల మధ్య సాగిపోతోంది. ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ పంచుతూ 12వ వారంలోకి అడుగుపెట్టేసింది.. ఈ వారం మొత్తం ఫన్నీ టాస్కులతో బిగ్ బాస్ ప్రేక్షకులకు తిరుగులేని వినోదాని పంచబోతున్నాడు.. ఈ వారం ‘బిగ్ బాస్ కోచింగ్ సెంటర్’ పేరిట ఒక ఫన్నీ టాస్కు ని బిగ్ బాస్ ఏర్పాటు చేసాడు..ఈ టాస్కులో ఆది రెడ్డి డాన్స్ టీచర్ గా , ఫైమా ఇంగ్లీష్ టీచర్ గా కనిపించబోతున్నారు.

ఫైమాకి ఇంగ్లీష్ రాదు, ఆది రెడ్డికి డాన్స్ రాదు అనే విషయం మనకి తెలిసిందే.. ఈ ఎలిమెంట్స్ ద్వారా అదిరిపొయ్యే ఫన్నీ స్కిట్ ని సిద్ధం చేసాడు బిగ్ బాస్.. దీనికి సంబంధించిన ప్రోమోని విడుదల చెయ్యగా దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది..వచ్చిరాని ఇంగ్లీష్ తో ఫైమా మాట్లాడిన మాటలకు ఇంటి సభ్యులు పగలబడి నవ్వుకున్నారు.
ఆ తర్వాత ఫైమా తెల్ల బోర్డు మీద ‘ఏ ఫర్ యాపిల్..బి ఫర్ బాల్’ అంటూ ‘ఈ’ అక్షరం దగ్గరకి వచ్చేసరికి ఎలిఫెంట్ స్పెల్లింగ్ ని తప్పు గా రాస్తుంది.. మీకు ఎలిఫెంట్ స్పెల్లింగ్ రాలేదు అంటూ ఆది రెడ్డి వెక్కిరిస్తాడు.. ఈ టాస్కు రన్నింగ్ అవుతున్న సమయంలోనే ఆది రెడ్డి భార్య కవిత కూతురుని తీసుకొని బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతుంది.. చాలా రోజులు తర్వాత భార్య కూతురుని చూడగానే ఆది రెడ్డి బాగా ఎమోషనల్ అయిపోతాడు.

ఆ తర్వాత తన కూతురు మొదటి పుట్టిన రోజు సందర్భంగా బిగ్ బాస్ హౌస్ లో కేక్ ని కట్ చేస్తాడు ఆది రెడ్డి.. ఆది రెడ్డి కుటుంబాన్ని అలా చూస్తూ రేవంత్ ఒక మూలాన కూర్చొని ఏడుస్తూ ఉంటాడు.. ఎందుకంటే రేవంత్ భార్య ఇప్పుడు 9 నెలల గర్భవతి అనే విషయం తెలిసిందే.. దాని కారణంగా ఆమె హౌస్ లోకి వస్తుందో లేదో అనే సందేహంతో ఆది రెడ్డి కుటుంబాన్ని చూడగానే కన్నీళ్లు పెట్టేసుకున్నాడు రేవంత్..ఆ ప్రోమో ని మీరు క్రింద చూడవచ్చు.