Retro Movie OTT : వరుసగా ఫ్లాప్స్ తప్ప హిట్ అంటే ఏంటో తెలియకుండా గత పదేళ్ల నుండి గడిపేస్తున్న తమిళ స్టార్ హీరో సూర్య(Suriya Sivakumar), రీసెంట్ గా ‘రెట్రో'(Retro Movie) చిత్రం తో మరో డిజాస్టర్ ఫ్లాప్ ని తన ఖాతాలో వేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం విడుదలకు ముందు పాటలు, టీజర్ కారణంగా యూత్ ఆడియన్స్ లో భారీ అంచనాలను ఏర్పాటు చేసుకుంది. కానీ ఈ సినిమా కేవలం ఫస్ట్ హాఫ్ తోనే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. ఇక సెకండ్ హాఫ్ అయితే థియేటర్స్ నుండి పరుగులు పెట్టేలా చేసింది. ఫలితంగా కమర్షియల్ గా ఈ చిత్రం పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. ఈ వీకెండ్ తో వంద కోట్ల గ్రాస్ మార్కుని కచ్చితంగా అందుకుంటుంది కానీ, బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 80 కోట్ల గ్రాస్ ని రాబట్టాల్సి ఉంటుంది, అది అనితర సాధ్యం.
Also Read : ఓటీటీ లో ‘రాబిన్ హుడ్’ కి సెన్సేషనల్ రెస్పాన్స్..2 రోజుల్లో వచ్చిన వ్యూస్ ఎంతంటే!
కలెక్షన్స్ కూడా దాదాపుగా అన్ని ప్రాంతాల నుండి ఆగిపోవడంతో ఈ చిత్రం ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైపోయింది. విడుదలకు ముందు ఈ చిత్రాన్ని నిర్మాతలు నెట్ ఫ్లిక్స్ సంస్థకు భారీ ఫ్యాన్సీ రేట్ కి అమ్మేశారు. నాలుగు వారాల తర్వాత ఓటీటీ లోకి విడుదల చేసుకునేలా ఒప్పందాన్ని చేసుకున్నారు. అంటే సరిగ్గా మే 28 కి నాలుగు వారలను పూర్తి చేసుకుంటుంది ఈ చిత్రం. మే 30న ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో తెలుగు తో పాటు అన్ని ప్రాంతీయ భాషల్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. థియేటర్స్ లో ఎలాగో డిజాస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, కనీసం ఓటీటీ లో అయినా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంటుందో లేదో చూడాలి. కొన్ని సినిమాలు థియేటర్స్ లో తెగ బోర్ కొట్టేస్తాయి, కానీ టీవీ టెలికాస్ట్ లో, లేదా ఓటీటీ లో చూసినప్పుడు మాత్రం చాలా బాగుందే అని అనిపిస్తుంది.
రెట్రో కూడా ఆ క్యాటగిరీ కి సంబంధించిన సినిమా అవ్వొచ్చు. ఎందుకంటే డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ సినిమాలు అందరి ఆడియన్స్ కి నచ్చేలా ఉండవు, కేవలం కొంతమంది ఆడియన్స్ కి మాత్రమే నచ్చేలా ఉంటుంది, కాబట్టి ఈ చిత్రం ఆ కొంతమంది ఆడియన్స్ కి నచ్చే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఈ చిత్రం ఏ రేంజ్ రెస్పాన్స్ ని ఓటీటీ లో సొంతం చేసుకుంటుందో. దురదృష్టం ఏమిటంటే గత పదేళ్లలో సూర్య నుండి విడుదలైన అద్భుతమైన చిత్రాలు ‘ఆకాశమే నీ హద్దురా’, ‘జై భీమ్’. కానీ ఈ రెండు సినిమాలు కూడా నేరుగా ఓటీటీ లోనే విడుదల అయ్యాయి. ఇవే కనుక థియేటర్స్ లో విడుదల అయ్యుంటే కచ్చితంగా ఆయన బాక్స్ ఆఫీస్ పరంగా కం బ్యాక్ ఇచ్చే అవకాశాలు ఉండేవి. ఇప్పుడు ఆయన ‘లక్కీ భాస్కర్’ డైరెక్టర్ తో తెలుగు లో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రంతో కం బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.