Mahesh Babu Son: పెహల్గామ్(Pahalgam) ఘటన తర్వాత ఇండియా, పాకిస్తాన్(Pakisthan) మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ నేపథ్యంలో, మన దేశ ప్రజల్లో పాకిస్థాన్ పై ఎంత ఫైర్ మీద ఉన్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరోపక్క బోర్డర్ వద్ద ఏ క్షణం లో అయినా యుద్ధం మొదలయ్యే అవకాశాలు రోజురోజుకి పెరిగిపోతుంది. భారత ప్రభుత్వం కూడా మన దేశం లో ‘సార్క్’ వీసాతో కొనసాగుతున్న పాకిస్థానీయులు తక్షణమే దేశం వదిలి వెళ్లిపోవాలని ఆదేశించిన సంగతి అందరికీ తెలిసిందే. పాకిస్థాన్ నటీనటుల సినిమాలను కూడా నిషేదించింది. అదే విధంగా దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా చూసే ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచులు కూడా ఇక మీదట జరిగబోవని BCCI స్పష్టంగా తెలియజేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇలాంటి హీట్ వాతావరణం నడుస్తున్న సమయం లో సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) తనయుడు గౌతమ్(Gowtham Krishna) ఒక పాకిస్తాన్ అమ్మాయితో కలిసి వీడియో చేయడం ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
Also Read: స్టార్ నటిగా మాత్రమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలతో కూడా బాగా ఫేమస్.. ఎవరో గుర్తుపట్టారా..
గౌతమ్ గత కొంతకాలంగా విదేశాల్లో చదువుకుంటున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అక్కడ అప్పుడప్పుడు ఆయన తన స్నేహితులతో కలిసి స్పెషల్ వీడియోస్ చేస్తూ ఉంటాడు. గతంలో కూడా ఆయన చేసిన ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడు రీసెంట్ గా ఆయన ఇండియా క్రికెట్ జెర్సీ ని ధరించి, పాకిస్థాన్ క్రికెట్ జెర్సీని ధరించిన అమ్మాయితో కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ చేసిన ఒక వీడియో సోషల్ మీడియా లో సంచలనం రేపుతోంది. మహేష్ బాబు అభిమానులు కూడా ఈ సమయంలో ఇలాంటివి అవసరమా?, వివాదాలకు దారి తియ్యకుండా ఉంటే చాలు అంటూ కామెంట్ చేస్తున్నారు. కానీ ఈ వీడియో లో గౌతమ్ చాలా క్యూట్ గా కనిపిస్తున్నాడు. మొదట్లో ఈయన హీరో గా పనికివస్తాడా లేదా అనే అనుమానాలు ఉండేవి.
Cute undi video… Controversy kakukunda unte chalu.. pakisthan papa ani pic.twitter.com/tFHbSGQtgd
— Nani (@Ravanaroy) May 1, 2025
కానీ రీసెంట్ గా ఆయన నుండి విడుదల అవుతున్న వరుస వీడియోలు, అందులో ఆయన నటన, పేషియల్ ఎక్స్ ప్రెషన్స్ ని చూసిన తర్వాత, కచ్చితంగా ఇతను కూడా మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ అవుతాడని అంటున్నారు. గతంలో ఆయన మహేష్ బాబు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘1 నేనొక్కడినే’ సినిమాలో నటించాడు. మహేష్ బాబు చిన్నప్పటి క్యారక్టర్ లో ఆయన ఒదిగిపోయి ఎంతో చక్కగా చేసాడు. అప్పుడే అభిమానులకు అనిపించింది, భవిష్యత్తులో ఈ కుర్రాడు కూడా సక్సెస్ అవుతాడని. ఇప్పుడు వివిధ యాంగిల్స్ లో చూసిన తర్వాత ఇక ఎలాంటి అనుమానాలు పెట్టుకొనవసరం లేదని మరింత స్పష్టంగా అర్థం అయ్యింది అంటూ అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న మొన్నటి వరకు షూటింగ్ కార్యక్రమాలను జరుపుకున్న ఈ చిత్రం నుండి మహేష్ బాబు ఒక 40 రోజుల పాటు వేసవి సెలవులు తీసుకున్నాడు.
Also Read: హిట్ 3 ఓటీటీలో.. ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చంటే?