Hit 3 : వరుసగా మూడు వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి ఊపు మీదున్న నాని(Natural Star Nani), రీసెంట్ గానే ‘హిట్ 3′(Hit : The Third Case) చిత్రం తో మరీ భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. మార్చ్, ఏప్రిల్ నెలల్లో మన టాలీవుడ్ నుండి విడుదలైన ఒక్క సినిమా సూపర్ హిట్ కాలేదు. సంక్షోభాన్ని ఎదురుకుంటున్న టాలీవుడ్ కి ‘హిట్ 3’ చిత్రం సూపర్ హిట్టై కొత్త ఊపిరి పోసింది. కేవలం నాలుగు రోజుల్లోనే దాదాపుగా అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా ఉన్నది. కొన్ని సెంటర్స్ లో 70 శాతం రికవరీ అయ్యింది. ఓవర్సీస్ లో అయితే మూడవ రోజునే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటేసి లాభాల్లోకి ఎంటర్ అయ్యింది. నిర్మాతలు ఈ చిత్రం నాలుగు రోజుల్లో 101 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టింది అని ఒక పోస్టర్ ని విడుదల చేసారు.
Also Read : నాని ‘హిట్ 3’ ఈవెంట్ లో పవన కళ్యాణ్ డైలాగ్ వాడటం వెనక అసలు కారణం ఇదేనా..?
కానీ ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం అంత గ్రాస్ వసూళ్లు ఈ చిత్రానికి ఇంకా రాలేదు. వాళ్ళు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి నాలుగు రోజుల్లో 89 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. షేర్ వసూళ్లు దాదాపుగా 47 కోట్ల రూపాయలకు పైగా వచ్చిందట. ఇంకో రెండు కోట్ల 72 లక్షల రూపాయిలు వస్తే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకున్నట్టే. ఈరోజు, రేపటి లోపు పూర్తి స్థాయి లాభాల్లోకి అడుగు పెట్టొచ్చు. ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒక్కసారి పరిశీలిస్తే, నైజాం ప్రాంతం నుండి 13 కోట్ల 11 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, సీడెడ్ నుండి 4 కోట్లు, ఉత్తరాంధ్ర నుండి 3 కోట్ల 82 లక్షలు, తూర్పు గోదావరి జిల్లా నుండి రెండు కోట్లు, వెస్ట్ గోదావరి జిల్లా నుండి కోటి 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
అదే విధంగా గుంటూరు జిల్లా నుండి 2 కోట్ల 18 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, కృష్ణ జిల్లా నుండి కోటి 81 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, నెల్లూరు జిల్లా నుండి 91 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి 29 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కి కలిపి 5 కోట్ల 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఇతర బాషల నుండి కోటి 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టగా, ఓవర్సీస్ నుండి 11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఓవరాల్ గా ఈ చిత్రానికి 89 కోట్ల రూపాయిల గ్రాస్ 47 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ ఈ చిత్రానికి రోజువారీ కలెక్షన్స్ బాగా తగ్గిపోతున్నాయి. శనివారం రోజున 5 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు తెలుగు రాష్ట్రం వస్తే, ఆదివారం రోజున 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
Also Read : హిట్ 3 కోసం రాజమౌళి మూవీని తాకట్టు పెట్టిన నాని… మహేష్ బాబు కోపానికి వస్తున్నాడా.?