ReRelease : టాలీవుడ్ లో రీ రిలీజ్ సినిమా ట్రెండ్ మొదలైనప్పటి నుండి అత్యధిక రికార్డ్స్ ని సొంతం చేసుకున్న హీరోలు పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), మహేష్ బాబు(Super Star Mahesh Babu). వీళ్లిద్దరి కెరీర్ ప్రారంభం లో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. అవి నేటి తరం అభిమానులు థియేటర్స్ లో చూసి ఉండరు కాబట్టి, వీటికి సెన్సేషనల్ రెస్పాన్స్ దక్కుతూ వచ్చాయి. ప్రస్తుతానికి మొదటి రోజు ఆల్ టైం రికార్డు ‘గబ్బర్ సింగ్’ ఖాతాలో ఉండగా, ఫుల్ రన్ ఆల్ టైం రికార్డ్ ‘మురారి’ ఖాతాలో ఉంది. అయితే నేడు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'(#SVSCReRelease) సినిమాని నిర్మాత దిల్ రాజు గ్రాండ్ గా రీ రిలీజ్ చేశాడు. క్లాస్ సినిమాకి జనాలు ఎక్కడ వస్తారులే అని ముందుగా అందరూ అనుకున్నారు. కానీ నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో, ప్రతీ సెంటర్ లో ఈ సినిమాకి పడిన హౌస్ ఫుల్స్ ని చూసి ట్రేడ్ పండితులు సైతం షాక్ కి గురయ్యాడు.
Also Read : చావా’ ని డామినేట్ చేసిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ రీ రిలీజ్..అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ఎంతంటే!
విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అభిమానులు ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam Movie) సూపర్ హిట్ తో మంచి జోష్ మీద ఉన్నారు, మరోపక్క మహేష్ బాబు మూడేళ్ళ వరకు వెండితెర మీద కనిపించడు , కనీసం రీ రిలీజ్ సినిమాల ద్వారా అయినా మహేష్ బాబు ని చూసుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో ఆయన అభిమానులు. ఇలా ఇరువురి హీరోల అభిమానులు కలిసి నేడు థియేటర్స్ ని కళకళలాడిపోయేలా చేసారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఓవర్సీస్ ఇలా అన్ని ప్రాంతాల్లోనూ ఈ చిత్రం దుమ్ము లేపే వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు కోటి 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లాంటి సెంటర్స్ లో ఈ సినిమాకి వీకెండ్ వరకు టికెట్స్ సేల్ అయిపోయాయి.
బుక్ మై షో లో ఇప్పటి వరకు దాదాపుగా లక్ష టిక్కెట్లు అమ్ముడుపోయాయని అంచనా వేస్తున్నారు. గబ్బర్ సింగ్, మురారి చిత్రాలకు బుక్ మై షో ద్వారా దాదాపుగా రెండు లక్షల 45 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఈ చిత్రానికి ఆ రేంజ్ లేకపోయినా, అద్భుతమైన ట్రెండ్ ని కనబర్చింది అనే చెప్పాలి. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చి డ్యాన్స్ వేసిన వీడియోలు, స్క్రీన్ మీద ప్రదర్శింపబడుతున్న సన్నివేశాలను స్క్రీన్ ముందు అభిమానులు రీ క్రియేట్ చేయడం, వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవ్వడం వంటివి చూసి అభిమానులు నెటిజెన్స్ ఆశ్చర్యపోయారు. ఇదేమి అభిమానం రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కేవలం మొదటి రోజు మాత్రమే కాకుండా, క్లోజింగ్ వరకు కూడా ఈ సినిమాకి భారీ స్థాయిలో వసూళ్లు వచ్చేలా అనిపిస్తుంది.
Also Read : వెంకటేష్ అరుదైన ఫీట్, సంక్రాంతికి వస్తున్నాం మూవీ 50 డేస్ ఎన్ని సెంటర్స్ లో ఆడిందో తెలుసా?