Chhaava Movie : రేపు తెలుగు వెర్షన్ ‘చావా'(Chhaava Movie) చిత్రం గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిల్చిన ‘చావా’ చిత్రం తెలుగు వెర్షన్ కోసం మన ఆడియన్స్ ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నారు. ఆడియన్స్ డిమాండ్ ని గుర్తించిన నిర్మాతలు బన్నీ వాసు(Bunny Vasu), అల్లు అరవింద్(Allu Aravind) చావా నిర్మాతలను సంప్రదించి, డబ్బింగ్ రైట్స్ ని కొనుగోలు చేసి, తెలుగు లో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలై చాలా రోజులైంది. కానీ డిమాండ్ కి తగ్గ బుకింగ్స్ అయితే జరగలేదు. ఆ సినిమా నిర్మాతలు విడుదల బాగా ఆలస్యం చేయడం వల్ల దాని ప్రభావం అయితే తెలుగు వెర్షన్ పై గట్టిగానే పడింది. ఎందుకంటే ఈమధ్య యూత్ ఆడియన్స్ టాక్ బాగుంటే హిందీ వెర్షన్ లోనే సినిమాలను చూసేస్తున్నారు. థియేటర్స్ కి వెళ్లని వాళ్ళు పైరసీ లో చూస్తున్నారు.
Also Read : చావా తెలుగు వెర్షన్ రిలీజ్ కి అడ్డంకులు..నెల్లూరు కలెక్టర్ కి ముస్లిమ్స్ ఫిర్యాదు..కారణం ఏమిటంటే!
అలా దాని ప్రభావం ఈ చిత్రం పై పడినట్టుగా అనిపిస్తుంది. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ లేకపోయినప్పటికీ, కౌంటర్ బుకింగ్స్ ద్వారా ఈ సినిమాకి తెలుగు వెర్షన్ లో మంచి ఓపెనింగ్స్ వస్తాయని బలమైన నమ్మకంతో ఉన్నారు మేకర్స్. మరోవైపు ఈ సినిమాతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu), విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) కాంబినేషన్ లో తెరకెక్కిన ఆల్ టైం క్లాసిక్ ‘సీతమ్మ వాకిట్లో..సిరిమల్లె చెట్టు’ కూడా రేపే రీ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా కి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి దాదాపుగా 50 హౌస్ ఫుల్స్ పడ్డాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam) సక్సెస్ తో ఫుల్ జోష్ మీదున్న దిల్ రాజు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'(Seethamma Vakitlo Sirimalle chettu) రీ రిలీజ్ పట్ల కూడా అత్యంత సంతృప్తి తో ఉన్నాడు. ఇది ఇలా ఉండగా బుక్ మై షో లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రానికి ‘చావా’ కంటే ఎక్కువ టిక్కెట్లు అమ్ముడుపోవడం ట్రేడ్ ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
చావా చిత్రానికి బుక్ మై షో యాప్ లో గడిచిన 24 గంటల్లో 10 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోగా, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రానికి 24 గంటల్లో 18 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. దీంతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఫైనల్ ప్రీ సేల్స్ గ్రాస్ 65 లక్షల రూపాయిలు వచ్చాయని, మొదటి రోజు పూర్తి అయ్యేసరికి కచ్చితంగా ఈ సినిమా కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు. మరో పక్క చావా చిత్రానికి ఇప్పటి వరకు కేవలం 50 లక్షల రూపాయిల గ్రాస్ మాత్రమే వచ్చిందట. కానీ రీ రిలీజ్ చిత్రానికి కౌంటర్ బుకింగ్స్ చాలా తక్కువ ఉంటుందని, చావా చిత్రానికి కౌంటర్ సేల్స్ చాలా ఎక్కువ ఉంటుందని, కాబట్టి చావా చిత్రానికే మొదటి రోజు ఎక్కువ వసూళ్లు వస్తాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
Also Read : చావా’ తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే మతి పోవాల్సిందే..అల్లు అరవింద్ అదృష్టం మామూలుగా లేదు!