Chiranjeevi Renu Desai: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ రాబోతుంది. ఇండియన్ రాబిన్ హుడ్ గా పేరుగాంచిన స్టువర్ట్ పురానికి చెందిన వ్యక్తినే ఈ ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ సినిమాలో రేణు దేశాయ్ చాలా కాలం తర్వాత కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. ఆమె పాత్ర చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందట. అయితే.. ఈ సినిమా ఓపెనింగ్ ను హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో గ్రాండ్ గా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథి. దాంతో మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గెస్ట్ గా ఈ వేడుకకు వచ్చారు. అప్పటికే రేణు దేశాయ్ ఈ వేడుకకు వచ్చి పక్కన కుర్చీలో కూర్చుంది. వస్తున్న మెగాస్టార్ ను చూసి అందరితో పాటు ఆమె కూడా పైకి లేచి నమస్కారం పెట్టింది. మరోపక్క మెగాస్టార్ అందరి వైపు చూస్తూ అందరికీ సైగలతోనే విష్ చేస్తూ ముందుకు వస్తున్నారు.
Also Read: AP New Districts: కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రక్రియ ప్రారంభమేనా?
ఈ క్రమంలో అక్కడ సడెన్ గా రేణు దేశాయ్ ను చూసి చిరు చిన్నపాటి షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. రేణు కూడా చిరుని చూసి పెద్దగా ఎగ్జైట్ కాలేదు. ఇద్దరి మధ్య కుటుంబ సభ్యుల అనుబంధం కనిపించలేదు. పైగా, మెగాస్టార్ ఈ వేడుకలో మాట్లాడుతూ ఉంటే.. రేణుదేశాయ్ కాస్త ఇబ్బందికర రియాక్షన్స్ కూడా పెట్టింది. బహుశా తన గురించి ప్రముఖంగా చెప్పలేదు అని ఆమె ఫీల్ అయ్యి ఉండొచ్చు. ప్రస్తుతం ఆమె రియాక్షన్ క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కూడా.
ఇక ఈ ఈవెంట్ లో తన రీఎంట్రీపై రేణు మాట్లాడుతూ.. `దర్శకుడు వంశీ ఈ సినిమా కథను 2019 లో చెప్పారని.. అప్పుడు తనకు తెరపై కనిపించాలనే ఆసక్తి లేదు అని, కానీ పాత్ర చాలా బాగుండటంతో టెమ్ట్ అయి ఓకే చెప్పాను’ అంటూ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇక ఈ చిత్రం రవితేజ కెరీర్లోనే ప్యాన్ ఇండియా సినిమాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.
ఎంతైనా టైగర్ నాగేశ్వరరావు విషయాలు బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. పైగా రవితేజ హీరో.. కాబట్టి ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరగడం ఖాయం.
కాగా ‘టైగర్ నాగేశ్వరరావు’లో కృతీ సనన్ సోదరి నుపూర్ సనన్‌ను హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే, ఇండియన్ మోడల్, నటి గాయత్రి భరద్వాజ్ కూడా సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది.
మరి రవితేజకు ఈ ‘టైగర్ నాగేశ్వర రావు’ ఎంతవరకూ హిట్ ని ఇస్తాడు అనేది చూడాలి. సినిమాలో అయితే, హీరో పాత్ర దొంగతనం చేసే సీన్స్ చాలా కామెడీగా ఉంటాయట. దర్శకుడు వంశీ ఈ సినిమాని ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. తమిళ మ్యూజిక్ సెన్సేషన్ జివి.ప్రకాష్ ఈ చిత్రాన్ని సంగీతం అందిస్తున్నాడు.
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read More