Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయిన రేణు దేశాయ్ ప్రస్తుతం రవితేజ హీరోగా వస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ఇక ఈమె ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటు ఆ సినిమా మీద మంచి అంచనాలను పెంచుతుంది. అయితే ఈ సినిమా లో ఈమె పోషించిన పాత్ర చాలా అద్భుతంగా ఉంటుందని సినిమా యూనిట్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రేణుదేశాయ్ మాట్లాడుతూ తన రెండో పెళ్లి గురించి ఒక క్లారిటీ ఇచ్చింది.నిజానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని మొదటి పెళ్లి చేసుకున్న ఈమె ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ మధ్య వచ్చిన కొన్ని గొడవల కారణం గా ఇద్దరు విడాకులు తీసుకోవడం జరిగింది.
ఇక దాని తర్వాత పిల్లలతో కలిసి రేణు దేశాయ్ పుణె లో ఉంటుంది.కానీ పవన్ కళ్యాణ్ మాత్రం హైదరాబాద్ లో ఉంటూ, అటు సినిమాలు, ఇటు పొలిటికల్ వ్యవహారాలు చూసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ విడిపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికి రేణు దేశాయ్ ని వదినమ్మ అనే పిలుస్తుంటారు. ఆమె కూడా పవన్ కళ్యాణ్ మీద ఎప్పుడు నెగిటివ్ గా మాట్లాడింది లేదు. ఆమె ప్రస్తుతం ఒంటరిగా ఉంటు పిల్లల బాగోగులు చూసుకుంటూ ఉంటుంది.అయితే ఒంటరిగా ఉండడాన్ని చూడలేకపోయిన రేణు దేశాయ్ వాళ్ళ పేరెంట్స్ ఆమెని రెండో పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేయడం చేసిన మొదట్లో ఆమె ఒప్పుకోలేదు కానీ చిన్న పిల్లలయిన అకిరా కి,అధ్య కి ఒక మనిషి తోడు గా మీతో పాటు ఉంటాడు అని కన్విన్స్ చేయడంతో నేను పెళ్లి కి ఒప్పుకున్నాను.
గత ఆరు సంవత్సరాల క్రితమే నేను రెండో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను ఇక దాంట్లో భాగంగానే నాకు బాగా తెలిసిన ఒక వ్యక్తితో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నాను అందరూ మాడి లవ్ మ్యారేజ్ అనుకున్నారు కానీ కాదు పెద్దలు కుదిర్చిన ఆరెంజ్డ్ మ్యారేజ్…ఇక ఆ ఎంగేజ్ మెంట్ అయిన తర్వాత నేను బాగా ఆలోచించాను ఇప్పుడు అధ్య చాలా చిన్నది ఇప్పుడు తన బాగోగులు అన్ని నేనే చూసుకుంటున్నాను. ఇక ఇలాంటి క్రమంలో అతన్ని పెళ్లి చేసుకుంటే ఎక్కువ టైం ఆయనతో స్పెండ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి పిల్లలను పట్టించుకోలేను, దాని వల్ల పిల్లలు ఒంటరివాళ్ళు అయిపోతారు అనే ఉద్దేశ్యం తోనే నేను ఆ పెళ్లి చేసుకోలేదు అంటూ చెప్పుకొచ్చింది.
ఇక ఇప్పుడు ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి వాళ్ళని ఏదో ఒక రంగంలో సెట్ చేసిన తర్వాత అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాను అని చెప్పింది. అకిరా నందన్ కూడా ఎప్పుడు నాతో నువ్వు ఒంటరిగా ఉండడం చూడలేకపోతున్నాను అమ్మ నీకు కూడా ఒక లైఫ్ ఉంది కదా వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని హ్యాపీ గా ఉండచ్చు కదా అని అంటూ ఉంటాడు. వాడు చాలా బ్రాడ్ గా ఆలోచిస్తూ ఉంటాడు అని చెప్పింది…