https://oktelugu.com/

Renu Desai : శోకసంద్రంలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కుటుంబం..కన్నీళ్లు రప్పిస్తున్న ఎమోషనల్ పోస్ట్!

ఎంతో ప్రేమగా చూసుకునే అమ్మ ఇలా తిరిగి రాని లోకాలకు పయనం అవ్వడం, ఆమెకి జీర్ణించుకోలేని విషయం. ఇంస్టాగ్రామ్ లో రేణు దేశాయ్ షేర్ చేసిన తన తల్లి ఫోటోని చూస్తే, రేణు దేశాయ్ ఆమెకు జిరాక్స్ కాపీ లాగా అనిపిస్తుంది. తన తల్లి అందమే కూతురుకి కూడా వచ్చిందని ఈ ఫోటోని చూసిన ఎవరైనా చెప్పొచ్చు.

Written By:
  • Neelambaram
  • , Updated On : November 21, 2024 / 08:57 PM IST

    Renu Desai

    Follow us on

    Renu Desai : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తల్లి నేడు స్వర్గస్తులయ్యారు. ఈ విషయాన్ని ఆమె తన ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులకు తెలియచేస్తూ తన తల్లి యవ్వనంలో ఉన్నప్పటి ఫోటోని అప్లోడ్ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘మనిషి పుడుతూ ఉంటారు, మరణిస్తూ ఉంటారు, మల్లి వేరే తల్లి కడుపులో నిద్రపోతారు. మానవ జీవన సముద్రం అపరిమితం, ఎవ్వరూ దాటలేనిది, నా ప్రభూ, ఈ జీవన ప్రయాణంలో నువ్వే నాకు సహాయం చేయాలి ‘ అంటూ తన మనసులో ఉన్న బాధని చెప్పుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు రేణు దేశాయ్ ని పరామర్శిస్తూ ధైర్యం చెప్తున్నారు. తన అమ్మ గురించి రేణు దేశాయ్ ఎన్నో సందర్భాలలో అనేక ఇంటర్వ్యూస్ చెప్పుకొచ్చింది. ఆమె మీద ఉన్న ప్రేమని వ్యక్తపరుస్తూ అనేక సందర్భాలలో కన్నీళ్లు కూడా పెట్టుకుంది.

    అలా ఎంతో ప్రేమగా చూసుకునే అమ్మ ఇలా తిరిగి రాని లోకాలకు పయనం అవ్వడం, ఆమెకి జీర్ణించుకోలేని విషయం. ఇంస్టాగ్రామ్ లో రేణు దేశాయ్ షేర్ చేసిన తన తల్లి ఫోటోని చూస్తే, రేణు దేశాయ్ ఆమెకు జిరాక్స్ కాపీ లాగా అనిపిస్తుంది. తన తల్లి అందమే కూతురుకి కూడా వచ్చిందని ఈ ఫోటోని చూసిన ఎవరైనా చెప్పొచ్చు. తన తల్లిదండ్రులకు తానూ మోడలింగ్ రంగంలోకి రావడం ఇష్టం లేదని, వాళ్లకి చెప్పకుండా నేను ఈ రంగంలోకి వచ్చినందుకు చాలా కాలం వరకు కోపంతో తనతో మాట్లాడలేదని, కెరీర్ లో సక్సెస్ అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు తన తల్లిదండ్రులకు మళ్ళీ దగ్గరయ్యాను అని రేణు దేశాయ్ అనేక సందర్భాలలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రేణు దేశాయ్ తన తల్లి ఊరు అయిన పూణే లోనే అనేక సంవత్సరాల నుండి ఉంటుంది. పిల్లలతో తో పాటు తన తల్లి తో కూడా కలిసి సంతోషంగా ఉంటున్న ఈ సమయంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం శోచనీయం.

    రేణు దేశాయ్ మరియు ఆమె కుటుంబానికి ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలని, ఆమె తల్లి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడికి ప్రార్థన చేద్దాము. ఇది ఇలా ఉండగా రేణు దేశాయ్ సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉంటూ, జంతు సంరక్షణ పై అనే అవగాహనా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. ఎన్నో మూగజీవాలకు ఆమె ఆశ్రయం కూడా కలిపించింది. హైదరాబాద్ లో జంతు సంరక్షణ కోసం తన కూతురు ఆద్య పేరిట ఒక NGO ని స్థాపించింది. ఈ సంస్థ ద్వారా ఆమె చేసిన సేవా కార్యక్రమాలు అన్ని ఇన్ని కావు. మూగ జీవాలకు చిన్న గాయం తగిలిన చలిచిపోయే మనస్తత్వం ఉన్న రేణు దేశాయ్ కి ఇలాంటి కష్టం రావడం అత్యంత బాధాకరం అని సోషల్ మీడియా లో అభిమానులు పోస్టులు పెడుతున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా రేణు దేశాయ్ కి ఈ సందర్భంగా సోషల్ మీడియా లో సంతాపం వ్యక్తం చేస్తున్నారు.