spot_img
Homeఎంటర్టైన్మెంట్Renu Desai: రేణు దేశాయ్ పై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన నిందితులు అరెస్ట్.. తస్మాత్ జాగ్రత్త!

Renu Desai: రేణు దేశాయ్ పై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన నిందితులు అరెస్ట్.. తస్మాత్ జాగ్రత్త!

Renu Desai: సినీ సెలబ్రిటీలు అంటే అభిమానులు ఏ స్థాయిలో ఉంటారో, దురాభిమానుల కూడా అదే స్థాయిలో ఉంటారు. కొంతమంది అయితే తమపై వచ్చే నెగటివిటీ ని పెద్దగా పట్టించుకోరు, చూసి చూడనట్టు వెళ్లిపోతుంటారు. కానీ కొంతమంది మాత్రం ఆ నెగటివిటీ ని మనసుకి బాగా తీసుకుంటారు, కొన్ని సార్లు బహిరంగంగా కోపం వ్యక్తం చేస్తూ తిడుతుంటారు, బ్లాక్ చేస్తుంటారు. కానీ హద్దులు దాటినా వారిపై మాత్రం పోలీస్ కేసులు వేస్తుంటారు. రీసెంట్ గానే ప్రముఖ యాంకర్ అనసూయ తనపై వచ్చే ట్రోలింగ్ ని తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించడం , వాళ్ళు వెంటనే ఫిర్యాదుని నమోదు చేసుకొని, ఆమెపై ట్రోల్స్ వేసిన వారి కోసం గాలించి మరీ అరెస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇదొక వార్నింగ్ కాల్ లెక్క అనుకోవచ్చు. చేతిలో మొబైల్ ఫోన్ , ఇంటర్నెట్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే జీవితమే పోతుంది.

Also Read: 17 ఏళ్లు దాటింది.. రాజస్థాన్ ఈసారైనా రాజసాన్ని చూపుతుందా? బలాలేంటి?బలహీనతలేంటి?

అనసూయ బాటలోనే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా తన పై ట్రోల్స్ చేసేవారిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, పోలీసులు నేడు వారిని అరెస్ట్ చేసిన సంఘటన హాట్ టాపిక్ గా మారింది. తనని టార్గెట్ చేస్తూ కొంతమంది సోషల్ మీడియా నిరంతరం దూషణలు చేస్తూ, నన్ను వేధిస్తున్నారని రీసెంట్ గానే ఆమె సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. రీసెంట్ గానే ఆమె వీధి కుక్కలా సమస్యపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి సుప్రీమ్ కోర్టు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి రేణు దేశాయ్ పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి ట్రోల్స్ వేరే లెవెల్ లో పడుతున్నాయి. అనేక మార్లు ఆమె తనను దూషించవద్దు, తీవ్రమైన పరిణామాలను ఎదురుకోవాల్సి వస్తుంది అంటూ వార్నింగ్ ఇచ్చింది. అయినప్పటికీ కూడా తగ్గలేదు.

దీంతో విసుగెత్తి పోయిన ఆమె పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది. తెలంగాణ పోలీసులు ఈమధ్య కాలం లో ఇలాంటి కేసులను చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. కాబట్టి నెటిజెన్స్ కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చక్కగా చదువుకొని , పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో సుఖంగా జీవించాల్సిన జీవితాన్ని ఇలా జైలు పాలు చేసి కెరీర్ ని నాశనం చేసుకోవద్దు అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. కాబట్టి మీకు ఏదైనా నచ్చకపోతే విమర్శిచడం లో తప్పే లేదు. కానీ ఒక గీత ఉంటుంది. దానిని దాటితే కెరీర్ నాశనమే అనే విషయం అర్థం చేసుకోండి అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular