Pawan Kalyan : బద్రి మూవీలో రేణు దేశాయ్-పవన్ కళ్యాణ్ జంటగా నటించారు. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్ హిట్. ఆ మూవీ సెట్స్ లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. రేణు దేశాయ్ ని పవన్ కళ్యాణ్ వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం రేణు దేశాయ్ నటనకు గుడ్ బై చెప్పింది. పవన్ కళ్యాణ్ సినిమాలకు ఆమె ఫ్యాషన్ డిజైనర్ గా పని చేసేది. కారణం తెలియదు కానీ రేణు దేశాయ్-పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకున్నారు.
అనంతరం రేణు దేశాయ్ పిల్లలు అకీరా, ఆద్యలతో పూణే వెళ్లిపోయారు. ఆమె అక్కడే ఉండేవారు. పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు పిల్లలను కలిసేందుకు పూణే వెళ్లేవారు. విడాకులు తీసుకున్నప్పటికీ రేణు దేశాయ్-పవన్ కళ్యాణ్ మధ్య స్నేహం కొనసాగుతుంది. పిల్లల కోసం తరచుగా కలుస్తూ ఉంటారు. అకీరా గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం కి పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ కలిసి హాజరయ్యారు.
మెగా ఫ్యామిలీలో జరిగే పండగలు, వేడుకలకు రేణు దేశాయ్ హాజరుకారు. అయితే పవన్ కళ్యాణ్ పిల్లల హోదాలో అకీరా, ఆద్య పాల్గొంటారు. రేణు దేశాయ్ కెరీర్ కోసం పూణే నుండి హైదరాబాద్ వచ్చేశారు. ఓ మూడేళ్ల నుండి రేణు దేశాయ్ హైదరాబాద్ లోనే ఉంటుంది. ఆమె నటిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. రవితేజ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు లో ఓ కీలక రోల్ చేసింది.
రేణు దేశాయ్ కి డైరెక్షన్ చేయాలనే కోరిక కూడా ఉంది. తన వద్ద కొన్ని కథలు ఉన్నాయని, వాటిని తెరకెక్కిస్తానని రేణు దేశాయ్ గతంలో చెప్పారు. కాగా రేణు దేశాయ్ సామాజిక, ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువే. ఈ క్రమంలో ఓ ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. రేణు దేశాయ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలవనున్నారట. పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ విడాకులు తీసుకుని చాలా ఏళ్ళు అవుతుంది. అధికారికంగా వారు కలిసింది లేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని రేణు దేశాయ్ కలుస్తున్నారన్న వార్త సంచలనం రేపుతోంది.
రేణు దేశాయ్ భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ కి చీఫ్ అడ్వైసర్ గా ఉన్నారు. తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిశారు. త్వరలో ఏపీ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డిని కూడా రేణు దేశాయ్ కలుస్తారట. అదే సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కూడా ఆమె కలుస్తారట. ఈ జెనరేషన్ యువతకు ఆధ్యాత్మిక విషయాల పట్ల అవగాహన, జ్ఞానం ఉండాలి.
హిందూ సంస్కృతి, దైవచింతన, ఆధ్యాత్మిక భావాలు పెంపొందించే యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనేది రేణు దేశాయ్ ఆలోచన. ఆ దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయాలని రేణు దేశాయ్ ఏపీ, తెలంగాణ మంత్రులను కలిసి వినతి పత్రాలు అందించనున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తో రేణు దేశాయ్ భేటీ ఆసక్తికరంగా మారింది. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆరున్నర అడుగుల అకీరా పక్కా హీరో మెటీరియల్ అనడంలో సందేహం లేదు.