https://oktelugu.com/

మళ్ళీ ప్రేమ‌లో పడిన రేణూ దేశాయ్ !

పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణూ దేశాయ్ రెండో పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. అయితే తాజాగా తాను అఫీషియ‌ల్‌గా ప్రేమ‌లో ప‌డిన‌ట్టు చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆమె ఎవరితో ప్రేమలో పడిందా అంటూ ఆరా తీస్తున్నారు. నేను ఈ అబ్బాయితో ప్రేమలో ఉన్నానంటూ రేణు తన సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ చేస్తూ అనౌన్స్ చేసింది. అయితే రేణు ప్రేమలో పడింది మనిషితో కాదు, కుక్క పిల్లతో అని తేలింది. అవును.. ఇప్పుడు తాను ఈ […]

Written By:
  • admin
  • , Updated On : January 27, 2021 / 11:12 AM IST
    Follow us on

    పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణూ దేశాయ్ రెండో పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. అయితే తాజాగా తాను అఫీషియ‌ల్‌గా ప్రేమ‌లో ప‌డిన‌ట్టు చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆమె ఎవరితో ప్రేమలో పడిందా అంటూ ఆరా తీస్తున్నారు. నేను ఈ అబ్బాయితో ప్రేమలో ఉన్నానంటూ రేణు తన సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ చేస్తూ అనౌన్స్ చేసింది. అయితే రేణు ప్రేమలో పడింది మనిషితో కాదు, కుక్క పిల్లతో అని తేలింది. అవును.. ఇప్పుడు తాను ఈ కుక్క పిల్లతో ప్రేమలో పడిపోయినట్లు ప్రకటించింది రేణు దేశాయ్. రేణు దేశాయ్ కూడా జంతు ప్రేమికురాల‌ే. అందుకే ఆమెతో పాటు తన ఇంట్లో చాలా మూగ జీవాలు కూడా ఉంటున్నాయట.

    ఇక ‘రేణు దేశాయ్’ ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో సామాజిక స‌మ‌స్య‌ల‌ పై స్పందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మ‌హిళ‌ల పై జరిగే మానసిక దాడులను ఆమె తీవ్ర స్థాయిలో నిర‌సిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆమె రైతు సినిమా పనులతో బిజీగా ఉంది. ఇప్పటికే మరాఠీలో ‘రేణు దేశాయ్’ ఒక సినిమా తీస్తే.. అక్కడ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అదే తెలుగు సినిమా చేస్తే.. ఎంత లేదు అన్నా సినిమాకి ఫ్రీగా ఫుల్ పబ్లిసిటీ దొరుకుతుందనేది అమె ప్లాన్ లా ఉంది. కాబట్టి ఆమె తెలుగు సినిమాలను చేయడానికి సన్నాహాలు చేసుకుంటుంది.

    కాగా ప్రస్తుతం రేణు దేశాయ్ తెరకెక్కించబోయే సినిమా కథ రైతు కథాంశంతో సాగుతుందని.. రైతుల స్థితిగతులు, జీవన విధానం పరిశోధించి మరీ రేణూ దేశాయ్ ఎన్నో విషయాలను రిసెర్చ్ చేసి.. ఆమె రైతు సినిమా తీస్తుందట. మహేష్ బాబుకి వదినగా నటించబోతుందంటూ గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అయింది. అయితే, ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదు అంటూ రేణు క్లారిటీ ఇచ్చింది.