పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెబితేనే ఒక ప్రభంజనం. ఆ పేరు వింటేనే గూస్ బాంబ్స్ వచ్చేస్తుంది. పవన్ మేనియా ఎంత ఉందో ఇటీవల వకీల్ సాబ్ మూవీ సందర్భంగా బయటపడింది. సినిమా పాజిటివ్ టాక్ రావడంతో ఆయన అభిమానులు చేసిన అల్లరి అంతా ఇంతాకాదు..
అయితే పవన్ గురించి మాట్లాడినా.. మాట్లాడకపోయినా ఆయన సన్నిహితులకు సోషల్ మీడయా ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ పవన్ ఫ్యాన్స్ వల్ల ప్రధాన బాధితురాలిగా మారిపోతున్నారు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ తాజాగా పవన్-రేణుల కూతురు ఆద్యతో కలిసి కొంతసేపు ఇన్ స్టాగ్రామ్ లోకి వచ్చారు. ఇందులో నెటిజన్లకు కొన్ని కరోనా సూచనలు సూచనలు చేశారు.
ఇక పవన్ కూతురు, కొడుకు గురించి పవన్ ఫ్యాన్స్ ఈ లైవ్ లో తెగ ఇబ్బంది పెట్టారు. ‘అకీరా ఎందుకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండరు’ అని కొందరు పవన్ ఫ్యాన్స్ నేరుగా రేణు దేశాయ్ ని ప్రశ్నించారు. దీనికి కేవలం ఫ్రెండ్స్ తో మాత్రమే అకీరా క్లోజ్ గా సోషల్ మీడియాలో ఉంటారని.. తన ఖాతాలను పబ్లిక్ చేయడం అకీరాకు ఇష్టం లేదని రేణు చెప్పుకొచ్చింది.
ఇక పవన్ గురించి అడిగితే రేణు సీరియస్ అయ్యింది. పవన్ గురించి లైవ్ లో మాట్లాడినా.. మాట్లాడకపోయినా తప్పులు తీస్తారని.. మళ్లీ నన్నే తిడుతారని.. అలాంటప్పుడు నేనేం చేయాలో అర్థం కాదని.. అందుకే లైవ్ లోకి రావడం కష్టమనిపిస్తుందని రేణు దేశాయ్ తన మనసులోని బాధను వెళ్లగక్కింది.