Renu Desai on Political Entry: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సెలబ్రిటీస్ లో ఒకరు. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా ఈమె మూగజీవాల ప్రాముఖ్యతని జనాలకు తెలియజేయడం, వాటిని రక్షించడం వంటివి చేస్తూ ఉంటుంది. మూగజీవాలను హింసకు గురి చేసినా, వేరే ఏ విధంగా అయినా వాటిని బాధపెట్టిన, తన వైపు నుండి చాలా గట్టి రియాక్షన్ ఇస్తూ ఉంటుంది రేణు దేశాయ్. రీసెంట్ గా వీధి కుక్కలు కారణంగా జనాలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని, చిన్న పిల్లలను ఈ వీధి కుక్కలు గ్రూప్ అటాక్ చేసి చంపేస్తున్నాయని, ప్రభుత్వాలకు జనాల నుండి అత్యధిక శాతం ఫిర్యాదులు వెళ్ళడం తో, కొన్ని ప్రభుత్వాలు వీధి కుక్కలను చంపేయాలని నిర్ణయించుకున్నాయి, సుప్రీమ్ కోర్టు కూడా అందుకు మద్దతు పలికింది. సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పు పై మండిపడుతూ రేణు దేశాయ్ కాసేపటి క్రితమే హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసింది.
ఈ ప్రెస్ మీట్ చూసిన తర్వాత రేణు దేశాయ్ ఎందుకు ఇలా సడన్ గా ప్రెస్ మీట్ ప్రభుత్వాలను, సుప్రీమ్ కోర్టుని కుక్కల విషయం లో తప్పుబడుతుంది?, ఆమె రాజకీయాల్లోకి రాబోతున్నారా? అంటూ సోషల్ మీడియా లో పలు వెబ్ సైట్స్ కథనాలు ప్రచురించాయి. దీనిపై రేణు దేశాయ్ స్పందిస్తూ ‘నేను కేవలం కుక్కల కోసం మాత్రమే ప్రెస్ మీట్ కి వచ్చాను. నేను మీకు ఒక క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను, నేను రాజకీయాల్లోకి రావడం లేదు, ఏ పార్టీ లోకి వెళ్లడం లేదు, నాకు రాజకీయాల్లోకి రావాలి, ఏదైనా పార్టీ లో చేరాలి అనిపిస్తే, మీ అందరికీ చెప్పే చేస్తాను, కాబట్టి దయచేసి రూమర్స్ ని వ్యాప్తి చేయకండి. నాకు రాజకీయాలు అంటే ఇష్టం లేదు, నేను నా NGO తో సంతోషంగా ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇది ఇలా ఉండగా ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో రేణు దేశాయ్ మీడియా రిపోర్టర్ పై అరిచింది అంటూ యూట్యూబ్ లో కొన్ని థంబ్ నెయిల్స్ వచ్చాయి. దీని గురించి ఆమె క్లారిటీ ఇస్తూ ‘నేను మీడియా రిపోర్టర్ పై అరవలేదు. ప్రెస్ మీట్ కి వచ్చిన ఒక అతను, ఆరంభం నుండి నాపై అరుస్తూ ఉన్నాడు , స్టేజి మీదకు వచ్చి నన్ను కొట్టేలా ఉన్నాడు, అక్కడ ఉన్న సెక్యూరిటీ అతన్ని ఆపింది, అతను అలా ప్రవర్తించాడు కాబట్టే నేను అలా మాట్లాడాల్సి వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక కుక్కలను చంపడం పై ఆవేదన వ్యక్తం చేస్తూ రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి తీవ్రమైన వ్యతిరేకత వెలువడింది. దీనిపై కూడా ఆమె రియాక్షన్ ఇచ్చింది. అందుకు సంబంధించిన పూర్తి వీడియో ని క్రింద అందిస్తున్నాము చూడండి.
మీడియా ప్రతినిధులపై అరవడంపై రేణుదేశాయ్ క్లారిటీ
నాకు పాలిటిక్స్ ఇష్టం లేదు.. ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లడం లేదు
అతను నా మీద అరిచాడు, అందుకే నేను తిరిగి అరిచాను. దీనిలోకి నా పర్సనల్ జీవితాన్ని ముడిపెట్టకండి, నా పిల్లలను లాగవద్దు – #RenuDesai pic.twitter.com/vHXwXnZGNY
— greatandhra (@greatandhranews) January 19, 2026
