Remake Movies: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక భాషలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న సినిమాను తిరిగి వేరొక భాషలో రీమేక్ చేయడం సర్వసాధారణం.ఈ క్రమంలోనే పలు భాషలలో తెరకెక్కిన కొన్ని చిత్రాలు అద్భుతమైన విషయాలను అందుకోగా కొన్ని సినిమాలు మాత్రం కొన్ని చోట్ల విజయం అందుకుంటే మరొక భాషలో అట్టర్ ఫ్లాప్ గా నిలుస్తాయి.
ఇలా ఒక భాషలో హిట్ అయి మరొక భాషలో అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.ముఖ్యంగా తెలుగులో బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలను అందుకున్న కొన్ని సినిమాలను తమిళంలో రీమేక్ చేయగా ఆ సినిమాలో అక్కడ అట్టర్ ఫ్లాప్ గా నిలబడ్డాయి. మరి ఆ సినిమాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సింహాద్రి సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇదే సినిమానీ తమిళంలో రీమేక్ చేయగా అట్టర్ ఫ్లాప్ గా నిలబడింది. అలాగే రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా కూడా తమిళంలో డిజాస్టర్ గా మిగిలిపోయింది.
ఇక అల్లు అర్జున్ నటించిన ఆర్య జులాయి వంటి సినిమాలు తెలుగులో మంచి ప్రేక్షకాదరణ తగ్గించుకున్నాయి. ఈ చిత్రాలను తమిళంలోకి రీమేక్ చేయగా తమిళంలో అట్టర్ ఫ్లాపయ్యాయి.
అలాగే గోపీచంద్ నటించిన లక్ష్యం, లౌక్యం , సౌర్యంవంటి సినిమాలు తెలుగులో మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్నప్పటికి తమిళంలో రీమేక్ చేయగా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.
అలాగే నాగచైతన్య, తమన్నా జంటగా నటించిన 100% లవ్ సినిమా తమిళంలో ఫ్లాప్ గా నిలబడింది.
అలాగే పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా తెలుగులో సంచలన విజయం సాధించగా తమిళంలో డిజాస్టర్ గా నిలబడింది.
కళ్యాణ్ రామ్ అతనొక్కడే సినిమా సైతం తమిళంలో డిజాస్టర్ అయ్యింది.
Also Read: Nayeem Dairies: నయీం డైరీస్కు షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు.. సినిమా ఆపేయాలని ఆదేశం
నితిన్ నటించిన ఇష్క్, దిల్ వంటి చిత్రాలను తమిళంలో రీమేక్ చేయగా ఈ సినిమాలు తమిళ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
ఇలా తెలుగులో అద్భుతమైన విజయాలను సాధించి తమిళంలో ఈ చిత్రాన్ని డిజాస్టర్ గా నిలబడ్డాయి.
Also Read: Dil Raju: సింగర్ అవతారం ఎత్తిన నిర్మాత దిల్ రాజు… వైరల్ గా మారిన వీడియో