Father Sentiment Movies: తండ్రి కొడుకుల అనుబంధం ఎంతైనా గొప్ప అనుబంధం. ఈ రిలేషన్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎన్ని కష్టాలు ఉన్నా కూడా కొడుకు జీవితం కోసం తండ్రి తన జీవితాన్ని సాక్రిఫైజ్ చేస్తారు. తండ్రి పడిన కష్టం గుర్తిస్తే కొడుకు కూడా తన జీవితం మొత్తంలో తండ్రి కోసం ఏదైనా చేయాలి అనుకుంటారు. అయితే ఇలా మంచి తండ్రి కొడుకుల కంటెంట్ తో వచ్చిన సినిమాలు ఏంటి? అవి ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యాయో తెలుసుకుందాం..
నాన్నకు ప్రేమతో.. జూనియర్ ఎన్టీఆర్ కొడుకు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ తండ్రి పాత్రలో నటించిన సినిమా నాన్నకు ప్రేమతో. ఈ సినిమా ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టుకునేలా చేసింది. 2016లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు కమర్షియల్ హిట్ ను కూడా సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా వచ్చిన కొన్ని రోజులకే జూ. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మరణించడం బాధాకరం. ఇక ఇది ఎన్టీఆర్ లైఫ్ లో మరిచిపోలేని ఒక సంఘటన గా మిగిలిపోయింది.
s/o సత్యమూర్తి.. ప్రకాష్ రాజ్ తండ్రి పాత్రలో అల్లు అర్జున్ కొడుకుగా వచ్చిన సినిమా s/o సత్యమూర్తి. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ తో దూసుకుపోయింది. ఇక అల్లు అర్జున్ సరసన నటించిన సమంత మంచి మార్కులు సంపాదించింది. 2015లో వచ్చిన ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది.
సూర్య s/o కృష్ణన్.. సూర్యనే డబుల్ రోల్ లో నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళంలో మొదట విడుదలైన ఈ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేశారు. సమీరా రెడ్డి, సిమ్రాన్, దివ్య స్పందన హీరోయిన్స్ గా నటించారు.
యానిమల్.. రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను అలరించిన సినిమా యానిమల్. రణబీర్ కపూర్ హీరోగా అనిల్ కపూర్ తండ్రి పాత్రలో నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు సందీప్ వంగా రెడ్డి దర్శకత్వం వహించారు.
అన్నింటిలో తండ్రిపై సాఫ్ట్ ప్రేమ చూపించారు. కానీ యానిమల్ లో మాత్రం ఒక హార్డ్ ప్రేమ కనపడింది. కొత్త కోణాన్ని సందీప్ రెడ్డి వంగ ఆవిష్కరించారు. పిల్లలను పట్టించుకోని తండ్రులు.. వారి కోసం తపన పడే కొడుకులలోని నిగూఢ కోణాన్ని ఆవిష్కరించారు. అందుకే అన్ని సినిమాలు ఒక ఎత్తు.. ఈ యానిమల్ అన్నింటిలోకి మరో ఎత్తుగా చెప్పొచ్చు. తండ్రీ కొడుకుల బంధంలో వచ్చిన అన్ని సినిమాల్లోకి ‘యానిమల్’ ది బెస్ట్ అని చెప్పొచ్చు.