Balka Suman: బాల్క సుమన్‌ బరితెగించాడు.. రేవంత్‌ను ఎంత మాటన్నాడో తెలుసా?

సీఎం రేవంత్‌రెడ్డిపై బాల్క సుమన్‌ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ మంచిర్యాల జిల్లా నేతలు తీవ్రంగా ఖండించారు. అధికారంలో ఉన్నట్లుగా అహంకారంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు.

Written By: Raj Shekar, Updated On : February 6, 2024 9:52 am
Follow us on

Balka Suman: తెలంగాణలో రాజకీయ విమర్శలు మాటలు దాటి.. చేతల వరకు వస్తునాయా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. తెలంగాణ సంస్కృతి, యాస పేరుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సీఎం హోదాను కూడా మర్చిపోయి విపక్ష నేతలను దుర్భాషలాడారు. ఉద్యమ సమయంలో ఏపీ నేతలను బండ బూతులు తిట్టారు. అధికారంలో ఉన్నప్పుడు విపక్షాలను తూలనడారు. ఏడాది క్రితం ప్రధాని మోదీని కూడా వదలలేదు. ఇదేం భాష అంటే.. తెలంగాణలో ఇలాంటి పదాలు తప్పు కాదని చెప్పేవారు.

క్రమంగా అలవాటు..
యథారాజా.. తథా ప్రజ అన్నట్లు.. కేసీఆర్‌ భాషను తర్వాత అందరూ ఒంటపట్టించుకున్నారు. విపక్షంలో ఉన్న రేవంత్, బండి సంజయ్‌ కూడా అవే పదాలు వాడడం మొదలు పెట్టారు. ఇక బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులకు దుర్భాషలాడడం కామన్‌ అయిపోయింది. ఒకవైపు ఎన్నికల్లో ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్‌.. ఇంకోవైపు ప్రభుత్వంపై నెగిటివిటీ పెరగకపోవడం బీఆర్‌ఎస్‌ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డిని తూలనాడుతున్నారు.

ఒక అడుగు ముందుకేసిన బాల్క సమున్‌..
ఇంతకాలం మాటలతోనే నెట్టుకొస్తున్న బీఆర్‌ఎస్‌ నేతలు.. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేశారు. చేతలకు దిగేందుకు వెనుకాడమని హెచ్చనిస్తున్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నామన్న విషయం మర్చిపోయి.. అధికారంలో ఉన్నట్లుగానే అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీని తీవ్ర పదజాలంతో విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను ఉద్దేశించి చేసిన ఓ పదాన్ని పట్టుకునీ చెన్నూర్‌ మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్, బాలక్క సుమన్‌ రెచ్చిపోయాడు. మంచిర్యాల బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ సమావేవంలో రేవంత్‌రెడ్డిని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు.

రాయలేని భాషలో..
‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేంత్‌రెడ్డి ఈ చెడ్డనా కొడుకును చెప్పుతో కొడుతా’ అంటూ కాలి చెప్పు తీసి చూపించాడు. ‘తెలంగాణ ఉద్యమ కారుడు, 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవలందించిన కేసీఆర్‌ను రండ అంటావా.. అధికారం ఉందన్న ఆహంకారంతో పద్ధతి లేకుండా, ముఖ్యమంత్రిని అని మర్చిపోయి మాట్లాడుతున్నావ్‌. బిడ్డా… రేవంత్‌ ఖబడ్దార్‌’ అని హెచ్చించాడు.

ఖండించిన కాంగ్రెస్‌..
సీఎం రేవంత్‌రెడ్డిపై బాల్క సుమన్‌ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ మంచిర్యాల జిల్లా నేతలు తీవ్రంగా ఖండించారు. అధికారంలో ఉన్నట్లుగా అహంకారంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. పోలీస్‌ స్టేషన్లలో బాల్క సుమన్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో పలు పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

మొత్తంగా తెలంగాణ పాలిటిక్స్‌ చూస్తుంటే.. మాటలు దాటి చేతల వరకు వచ్చినట్లు కనిపిస్తోంది.