Bigg Boss: బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్‌బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. ఆద్యంతం అలరిస్తూ ప్రేక్షకులకు ఫుల్ ట్రీట్ ఇస్తుంది ఈ షో. మరో రెండు రోజుల్లో బిగ్‌బాస్ విజేత ఎవరనేది తెలీపోనుంది. 19 మందితో మొదలైన ఈ షోలో ఇప్పుడు ఐదుగురు మిగిలారు. సన్నీ, శ్రీరామ్, మానస్, సిరి, షణ్ముఖ్ టాప్ 5 కంటెస్టెంట్స్‌గా మిగిలారు. వీరిలో ఎవరు విన్నర్ కాబోతున్నారనే ఉత్కంఠ అందరిలో మొదలైంది. ఇప్పటికే తమ అభిమాన కంటెస్టెంట్‌ను గెలిపించుకునేందుకు ప్రచారాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఓటింగ్ ప్రక్రియ తుది దశకు చేరింది.

Also Read: మిగిలింది రెండు రోజులే… సర్వేలు ఏం తేల్చాయి?
ఈ క్రమంలో తమ అభిమాన కంటెస్టెంట్‌ను గెలిపించుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు రంగంలోకి దిగారు. సింగర్ శ్రీరామచంద్రకు ఇప్పటికే పలువురు ప్రముఖులు మద్దతు తెలిపారు. శ్రీరామచంద్ర గెలవాలని.. తనకు ఓటు వేసి గెలిపించాలని ఇప్పటికే శంకర్ మహదేవన్, ఆర్టీసి ఎండీ సజ్జనార్, రియల్ హీరో సోనూసూద్, పాయల్ రాజ్ పుత్ వంటి వారు మద్దతు తెలపగా… తాజాగా ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణం రాజు సతీమణి శ్యామల దేవి… శ్రీరామచంద్రకు మద్దతు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో శ్యామల దేవి మాట్లాడుతూ… శ్రీరామ్ పాటలంటే నాకు, కృష్ణంరాజు గారికి చాలా ఇష్టం. ముఖ్యంగా నువ్వు పాడిన భక్తి పాటలను ఎక్కువగా వింటుంటాం. అలాగే నువ్వు ఇండియన్ ఐడెల్ లో విన్నర్ గా నిలిచి తెలుగు వారందరికీ గర్వకారణంగా నిలిచావు. ఇప్పుడు బిగ్‌బాస్ లోనూ విజయం సాధించాలని మా కుటుంబం తరపున మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.
Also Read: ఈ పోరాటం ఏదో స్టీల్ ప్లాంట్ కోసం చేయండి… షణ్ముఖ్ ఫ్యాన్స్ పై నెటిజన్స్ ఫైర్!