https://oktelugu.com/

Balakrishna- Sai Pallavi: బాలకృష్ణ, సాయిపల్లవి యాడ్ లలో నటించకపోవడానికి కారణాలేంటి?

Balakrishna- Sai Pallavi: తెలుగు సినిమా పరివ్రమలో చాలా మంది ప్రకటనల్లోనూ నటిస్తుంటారు. ఇందులో మహేశ్ బాబు ముందుంటారు. ఇంకా జూనియర్ ఎన్టీఆర్, సమంత, ప్రకాశ్ రాజ్ లాంటి వాళ్లు ప్రైవేటు యాడ్ లలో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. విభిన్న రకాల యాడ్లలో నటించి తమ సంపాదన పెంచుకుంటున్నారు అయితే మహేశ్ బాబు చిన్న పిల్లల గుండెలకు శస్త్రచికిత్సలు చేయిస్తూ తన సంపాదనలో కొంత దానం చేస్తున్నారు. ఎందరో చిన్నారులకు గుండె ఆపరేషన్లు ఉచితంగా చేయించి తనకు […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 7, 2022 / 01:13 PM IST
    Follow us on

    Balakrishna- Sai Pallavi: తెలుగు సినిమా పరివ్రమలో చాలా మంది ప్రకటనల్లోనూ నటిస్తుంటారు. ఇందులో మహేశ్ బాబు ముందుంటారు. ఇంకా జూనియర్ ఎన్టీఆర్, సమంత, ప్రకాశ్ రాజ్ లాంటి వాళ్లు ప్రైవేటు యాడ్ లలో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. విభిన్న రకాల యాడ్లలో నటించి తమ సంపాదన పెంచుకుంటున్నారు అయితే మహేశ్ బాబు చిన్న పిల్లల గుండెలకు శస్త్రచికిత్సలు చేయిస్తూ తన సంపాదనలో కొంత దానం చేస్తున్నారు. ఎందరో చిన్నారులకు గుండె ఆపరేషన్లు ఉచితంగా చేయించి తనకు కూడా హృదయం ఉందని నిరూపిస్తున్నారు. ఎంత సంసాదించినా అందులో కొంత సాయం చేస్తూ ఎందరి జీవితాల్లోనే వెలుగులు చూపిస్తున్నాడు.

    Balakrishna- Sai Pallavi

    హీరో బాలకృష్ణ అయితే యాడ్లలో నటించేందుకు ముందుకు రావడం లేదు. తనకు అదనపు సంపాదన అవసరం లేదని చెబుతున్నారు. దీనికి తన తండ్రే నాకు మార్గనిర్దేశకుడని వివరిస్తున్నారు. తన తండ్రి కూడా జీవితంలో ఏ ఒక్క యాడ్ లో కూడా కనిపించలేదు. దీంతోనే తనకు ప్రకటనల్లో నటించే ఉద్దేశం లేదని తన మనసులోని మాట బయట పెట్టారు. కొన్ని సెకన్ల పాటు కనిపించే యాడ్ కోసం కోట్లు తీసుకుని నటించడం అంటే ఇష్టం ఉండదని సూటిగా చెప్పారు. అభిమానులు తనపై అభిమానంతో ఆదరిస్తున్నారు. అందుకే జీవితంలో నటనకే ప్రాదాన్యం ఇస్తున్నాను. అంతేకాని ఇలా యాడ్లలో నటించి పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోవడం బాగుండదు.

    Also Read: Kangana Ranaut: బాబోయ్ విచ్చలవిడిగా రెచ్చిపోయింది కంగనా.. ఇదేం ఎక్స్ పోజింగ్ రా బాబు !

    హీరోయిన్ సాయిపల్లవి కూడా తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. కొన్ని సెకన్ల యాడ్ కు కోట్లు తీసుకోవడం సముచితం కాదు. తనకు షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తే చపాతి, అన్నం రెడీ గా ఉంటాయి. తృప్తిగా భోజనం చేసి హాయిగా ఉండటమే తనకిష్టమని చెబుతోంది. పైగా మనం చెబితే నల్లగా ఉన్న వారు తెల్లగా అవుతారా? అదంతా ఓ మోసం దాని కోసం మనం మనసు చంపుకుని నటించడం ఇష్టం లేదని కామెంట్ చేశారు.

    Balakrishna- Sai Pallavi:

    యాడ్స్ ద్వారా వచ్చే డబ్బులను ఏం చేసుకుంటాం. ఎందుకు అంత ఆశ ఉండకూడదు. జీవితం తృప్తిగా ఉండాలనేదే తన లక్ష్యం. అందుకే యాడ్ లలో నటించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనవసరంగా నటించి వారి నుంచి పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకుని ఏం చేస్తాం. ఎందుకు అంత అత్యాశ. సినిమాల్లో బాగా నటించి మంచి పేరు తెచ్చుకుంటే చాలు. అంతేకాని జీవితం దుర్భరంగా చేసుకునే ఇతర వాటి జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకుంది. అందుకే యాడ్స్ లలో నటించకుండా ఉండేందుకే మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి యాడ్లలో నటించబోనని తన మనసులోని మాట చెబుతోంది.

    Also Read:Chandrababu Comments On Allainces: త్యాగాల రాజకీయం.. రండి వైసీపీని ఢీకొడదాం.. చంద్రబాబు ఐక్యతారాగం!!

    Tags