https://oktelugu.com/

Devara: దేవర సినిమా వాయిదా పడిందనడానికి కారణాలు ఇవిగో…

ప్రస్తుతం దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఎన్టీఆర్. ఈ సినిమాపై ఇప్పటికే ఎన్టీఆర్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు కూడా.

Written By: , Updated On : January 25, 2024 / 04:00 PM IST
Devara

Devara

Follow us on

Devara: ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఈయన నటించే సినిమాలు మంచి సక్సెస్ ను అందుకుంటాయి. రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ పాన్ ఇండియా వరల్డ్ రేంజ్ లో హిట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ ప్రపంచ వ్యాప్తంగా పాకిందనడంలో సందేహం లేదు. దీంతో ఈయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు అయ్యారు.

ప్రస్తుతం దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఎన్టీఆర్. ఈ సినిమాపై ఇప్పటికే ఎన్టీఆర్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు కూడా. అయితే ఈ సినిమా పోస్ట్ పోన్ కానుందంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ వార్తలపై దర్శకనిర్మాతలు ఇప్పటి వరకు స్పందించలేదు. మరి నిజంగానే దేవర సినిమా వాయిదా పడనుందా? ఒకవేళ వాయిదా పడితే కొత్త డేట్ ఎప్పుడు వస్తుందంటూ ఎదురు చూస్తున్నారు అభిమానులు.

అయినా ఎందుకు పోస్ట్ పోన్ అయింది. షూటింగ్ డిలే అవుతుందా? లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటూ కొందరు ఆందోళన చెందుతున్నారు. ఇక ఎన్టీఆర్ ఎంత తొందరగా సినిమాలు ప్లాన్ చేస్తున్నా కాలం మాత్రం కనికరించడం లేదంటున్నారు కొందరు. అధికారికంగా చెప్పలేదన్న మాటేగానీ దేవర సినిమా ఏప్రిల్ లో రావడం కూడా అసాధ్యమే అంటున్నారు కొందరు. దీనికి మూడు కారణాలు ఉన్నాయట. అనిరుధ్ 3 పాటలకు ఇంకా మ్యూజిక్ ఇవ్వలేదట. అంటే షూటింగ్ కూడా కాలేదన్నమాట. ఆర్ఆర్ కోసం ఎలాగైనా మూడు నెలల టైమ్ కావాలి అని అడుగుతున్నారని టాక్. బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం అనిరుధ్ చాలా టైమ్ తీసుకుంటారు. అదే దేవరకు శాపంగా మారుతుందట. మరో వైపు సైఫ్ అలీ ఖాన్ గాయం కూడా చిత్ర బృందాన్ని ఇబ్బంది పెడుతుందట. ఈయనతో మేజర్ సీన్లు అయిపోయినా.. ప్యాచ్ వర్క్ మాత్రం అలాగే ఉండిపోయాయట.

సైఫ్ వస్తే గానీ వాటిని పూర్తి చేయలేరు కొరటాల శివ. అది కూడా దేవర సినిమా వాయిదాకు ఒక కారణమే. దేవర సినిమా వాయిదా పడడానికి మరో ప్రముఖ కారణం ఏపీ ఎన్నికలు అని టాక్. ఏప్రిల్ రెండో వారంలో ఎలక్షన్స్ జరగనున్నాయి. అలాంటి సమయంలో తారక సినిమా రావడం కరెక్ట్ కాదని భావిస్తున్నారట మేకర్స్. అందుకే ఆగస్టు లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అంటే మొత్తానికి దేవర సినిమా వాయిదా పడినట్టే. మరి ఈ విషయాన్ని అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.