Stock Exchange : రిపబ్లిక్ డే రోజు స్టాక్ మార్కెట్ కు హాలిడే(Holiday) ఉంటుందా? ఈ ఏడాదిలో ఎన్ని సెలవులు?

Stock Exchange :భారతదేశ రిపబ్లిక్ డే ను ప్రతీ జనవరి 26న ఘనంగా నిర్వహిస్తారు. ఈరోజున పాఠశాలలు, కార్యాలయాలు, ప్రధాన కూడళ్లలో జెండాను ఎగురవేస్తారు. ఆ తరువాత గ్రౌండ్స్ లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ కార్యక్రమాలు పూర్తయిన తరువాత పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవును ప్రకటిస్తారు. ప్రైవేట్ సంస్థలు మాత్రం యధావిధిగా కొనసాగుతాయి. అయితే స్టాక్ ఎక్చేంజ్ కు రిపబ్లిక్ డే రోజు సెలవు ఉంటుందా? అని చాలా మందికి సందేహం […]

Written By: Chai Muchhata, Updated On : January 25, 2024 4:10 pm

Stock Exchange

Follow us on

Stock Exchange :భారతదేశ రిపబ్లిక్ డే ను ప్రతీ జనవరి 26న ఘనంగా నిర్వహిస్తారు. ఈరోజున పాఠశాలలు, కార్యాలయాలు, ప్రధాన కూడళ్లలో జెండాను ఎగురవేస్తారు. ఆ తరువాత గ్రౌండ్స్ లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ కార్యక్రమాలు పూర్తయిన తరువాత పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవును ప్రకటిస్తారు. ప్రైవేట్ సంస్థలు మాత్రం యధావిధిగా కొనసాగుతాయి. అయితే స్టాక్ ఎక్చేంజ్ కు రిపబ్లిక్ డే రోజు సెలవు ఉంటుందా? అని చాలా మందికి సందేహం ఉంది? అలాగే ఈ ఏడాదిలో ఎన్ని సెలవులు వస్తాయి? అనేది తెలుసుకుందా..

BSE, NSE స్టాక్ మార్కెట్ ప్రతిరోజూ ఉదయం 9.15 గంటలకు ప్రారంభమై సాయంత్రం 3.30 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రతీ వారంలో శనివారం, ఆదివారం రెండు రోజులు సెలవు ఉంటుంది. ప్రత్యేక దినాల్లో హాలిడే ప్రకటిస్తారు.రిపబ్లిక్ డే సందర్భంగా మిగతా సంస్థల మాదిరిగానే BSE, NSE స్టాక్ మార్కెట్ కు సెలవు ఉంది. ఆతరువాత శనివారం, ఆదివారం సెలవు దినాలు కావడంతో తిరిగి జనవరి 29 సోమవారం పునరుద్ధరించబడుతాయి. అయితే కమోడిటీస్ మార్కెట్లకు మాత్రం సెలవు లేదు.

అలాగే 2024లో స్టాక్ మార్కెట్ కు సెలవులను పరిశీలిస్తే..

మార్చి 8, శుక్రవారం – మహాశివరాత్రి

మార్చి 25, సోమవారం – హోలీ

మార్చి 29, శుక్రవారం – గుడ్ ఫ్రైడే

ఏప్రిల్, 11 గురువారం- రంజాన్

ఏప్రిల్, 17 బుధవారం- శ్రీరామనవమి

మే 1 బుధవారం – కార్మిక దినోత్సవం

జూన్ 17 సోమవారం – బక్రీద్

జూలై 17 బుధవారం -మోహర్రం

ఆగస్టు 15 గురువారం -స్వాతంత్ర్య దినోత్సవం

అక్టోబర్ 2 బుధవారం -గాంధీ జయంతి

నవంబర్ 1 శుక్రవారం -దీపావళి

నవంబర్ 15 శుక్రవారం – గురునానక్ జయంతి

డిసెంబర్ 25 బుధవారం -క్రిస్మస్

సెలవు  రోజుల్లో పండుగల వచ్చిన దినాలు..

ఏప్రిల్ 14 ఆదివారం -అంబేద్కర్ జయంతి

ఏప్రిల్ 21 ఆదివారం – మహవీర్ జయంతి

సెప్టెంబర్ 7 శనివారం -వినాయక చవితి

అక్టోబర్ 12 శనివారం – దసరా

నవంబర్ 2 శనివారం -దీపావళి