Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా లెజినోవా తో విడిపోవడం ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, నేషనల్ లెవెల్ లో కూడా ఇప్పుడు దీని గురించే చర్చ. స్వయంగా పవన్ కళ్యాణ్ ఈ విషయాన్నీ మీడియా కి ఒక పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దంపతులిద్దరూ ఎంతో అన్యోయంగా ఉన్నారు , రెండు నెలల క్రితమే పవన్ కళ్యాణ్ కి అన్నా లెజినోవా పుట్టినరోజు శుభాకాంక్షలు ఎంతో ప్రేమతో చెప్పింది. నీ లాంటి భర్త దొరకడం నాకు అదృష్టం అంటూ చెప్పుకొచ్చింది. కానీ ఇంతలోపే ఏమైందో ఏమో తెలియదు కానీ , అభిమానులకు ఈ షాకింగ్ న్యూస్ తెలిసింది. ఇది కాస్త జీర్ణించుకోవడం కష్టమే. అభిమానులు ఈసారి వెనకేసుకొని వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు.
ఎందుకంటే ఒకసారి చేస్తే పొరపాటు అనుకోవచ్చు , వరుసగా మూడు సార్లు అదే జరిగింది కాబట్టి , కచ్చితంగా లోపం పవన్ కళ్యాణ్ దగ్గరే ఉంటుంది అని అంటున్నారు విశ్లేషకులు. అయితే రెండు నెలల క్రితం వరకు కూడా ఎంతో మంచిగా ఉన్న ఈ దంపతులు అర్థాంతరంగా ఇలా విడిపోవడానికి గల కారణం ఏంటి ? అనే సందిగ్ధం లో పడ్డారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అయితే ఈ దంపతులిద్దరి మధ్య విబేధాలు కొత్తగా ఏమి రాలేదు. 2023 వ సంవత్సరం లోనే వీళ్లిద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. ఆ తర్వాత సర్దిచెప్పుకొని తమ దాంపత్య జీవితాన్ని కొనసాగించే ప్రయత్నం చాలా వరకు చేశారు. కానీ కుదరకపోవడం తో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అయితే వీళ్ళు విడిపోవడానికి గల కారణాలు 4 ఉన్నాయని అంటున్నారు నెటిజెన్స్. ఒకటి ప్రజా జీవితం లో ఉన్న పవన్ కళ్యాణ్ తన కుటుంబానికి కావాల్సినంత సమయం ఇవ్వలేదు అని.
ఏ ఆడపిల్లకు అయినా ఒక తోడు అత్యంత అవసరం లేదు. వాళ్ళు బాధలో ఉన్నప్పుడు కానీ , సొంతోషం లో ఉన్నప్పుడు కానీ , కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్ జీవితం మొత్తం ప్రజా జీవితానికే అంకితం చేసాడు. ఆ సమయం లో వ్యక్తిగతంగా ఆడవాళ్లు ఒత్తిడికి లోను అవుతున్నప్పుడు తమకంటూ ఒక తోడు కావాలని కోరుకుంటారు. అది దొరకనప్పుడే గొడవలు మొదలు అవుతాయి. ఆ గొడవలు ఇలా విడాకుల వరకు దారి తీస్తుంది. వీళ్లిద్దరు విడిపోవడానికి గల మరో కారణం కమ్యూనికేషన్ గ్యాప్ అని అంటున్నారు నెటిజెన్స్. అన్నా లెజినోవా విదేశాల్లో రీసెంట్ గానే డిగ్రీ పూర్తి చేసింది, ఆమె అత్యధిక సమయం ఇండియా లో కంటే సింగపూర్ లోనే గడుపుతూ వచ్చింది. తన తనయుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు కూడా ఆమె సింగపూర్ లోనే ఉంది , కానీ పవన్ కళ్యాణ్ మాత్రం హైదరాబాద్ లో ఉన్నాడు.
మార్క్ శంకర్ కి ప్రమాదం జరిగినప్పటి నుండి అన్నా లెజినోవా హైదరాబాద్ లోనే ఉంటుంది కానీ , అంతకు ముందు ఆమె ఎక్కువ సమయం సింగపూర్ లోనే గడిపేది. ఇక మూడవ కారణం ఆరోగ్య సమస్యలు. పవన్ కళ్యాణ్ రీసెంట్ గానే సర్జరీ చేయించుకున్నాడు. ముంబై సర్జరీ సమయం లో అన్నా లెజినోవా కూడా పక్కనే ఉన్నింది కానీ , కేరళ లో ఆయుర్వేద సర్జరీ చేయించుకున్నప్పుడు మాత్రం ఆమె పవన్ కళ్యాణ్ తో లేదు. కచ్చితంగా ఆ సమయం లోనే ఎదో జరిగింది అని అంతా అనుకుంటున్నారు. ఏమి జరిగిందో ఆ దేవుడికే తెలియాలి. ఈ అంశం పై పవన్ కళ్యాణ్ స్వయంగా స్పందించి మాట్లాడితే తప్ప , అభిమానులు కూడా సమాజం లో తల ఎత్తుకొని తిరగలేని పరిస్థితి. రీసెంట్ గానే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ వంద శాతం స్ట్రైక్ రేట్ ని సాధించి రాష్ట్ర రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించింది.
అభిమానులు ఈ సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్నారు. సాధారణంగా ఇలాంటి సక్సెస్ లు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ తన కార్యకర్తలతో కలిసి మంగళగిరి పార్టీ ఆఫీస్ లో మీటింగ్ పెడుతాడు. కానీ ఈసారి అలాంటిదేమి చెయ్యలేదు. అసలు ఈ లోకల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చాలా సైలెంట్ గా ఉన్నాడు. కీలకమైన ఈ సమయం లో పవన్ ఎందుకు ఇంత మౌనం గా ఉన్నాడో అభిమానులకు అసలు అర్థం అవ్వలేదు. అంతే కాకుండా ఈమధ్య కాలం లో మదనపల్లి మీటింగ్ సమయం లో కానీ , సీఎం చంద్రబాబు తో కలిసి ఉమ్మడిగా ప్రెస్ మీట్ పెట్టిన సమయం లో కానీ పవన్ కళ్యాణ్ ని చూసిన నెటిజెన్స్ అసలు ఇతనికి ఏమైంది?, ముఖం లో చిరు నవ్వు లేదు , చాలా డిప్రెషన్ లో ఉన్నాడు , అసలు ఏమైంది?, కూటమి పార్టీల మధ్య సఖ్యత లేకపోవడం వల్లే ఇలా ఉన్నాడా?, సీట్ల సర్దుబాటు విషయం లో ఏదైనా తేడా జరిగిందా అని నెటిజెన్స్ ఆరాలు తీశారు.
కానీ ఆయన సైలెన్స్, బాధ వెనుక అసలు కారణం వ్యక్తిగత సమస్యలే అని ఇప్పుడు అర్థం అవుతోంది. రీసెంట్ గానే సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం జరిగింది. తన మేనల్లుడు అంటే పవన్ కళ్యాణ్ కి ఎంతో ప్రేమ. మెగా ఫ్యామిలీ మొత్తం ఈ నిశ్చితార్ధ వేడుకకు హాజరైంది కానీ, పవన్ కళ్యాణ్ రాకపోవడం తో ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు. కచ్చితంగా ఎదో జరిగింది అని అంతా అనుకున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చినా రాకపోయినా ఇలాంటి ఈవెంట్స్ కి ఆయన తరుపున అన్నా లెజినోవా వస్తుంది. కానీ ఆమె కూడా రాకపోవడం తో అందరిలోనూ అనుమానాలు కలిగాయి. ఆ అనుమానాలకు నిజం చేస్తూ ఇప్పుడు ఇలాంటి పరిణామం జరగడం దురదృష్టకరం. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.