Star Heroes’ Remunerations: 1980 స్ లో స్టార్ హీరోల రెమ్యూనరేషన్స్ లిస్ట్.. ఎవరికి ఎక్కువ అంటే ?

Star Heroes’ Remunerations:  తెలుగు సినిమాలకు తమిళ సినిమాలకు మధ్య ఒకప్పుడు విపరీతంగా పోటీ ఉండేది. . ముఖ్యంగా 1980 లో తమిళ సినిమాలను తలదన్నేలా ధీటుగా తెలుగు సినిమాలు వచ్చేవి. పైగా ఆ రోజుల్లో తెలుగు సినిమా పరిశ్రమ తమిళనాడులోనే ఉండేది. ఇక ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌ కు మకాం మార్చింది. ఏఎన్నార్ ప్రోత్సాహంతో మొత్తమ్మీద టాలీవుడ్ కేరాఫ్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్ అయింది. ఇక ఆ తర్వాత ఇండస్ట్రీలో చాలా […]

Written By: Shiva, Updated On : February 19, 2022 11:50 am
Follow us on

Star Heroes’ Remunerations:  తెలుగు సినిమాలకు తమిళ సినిమాలకు మధ్య ఒకప్పుడు విపరీతంగా పోటీ ఉండేది. . ముఖ్యంగా 1980 లో తమిళ సినిమాలను తలదన్నేలా ధీటుగా తెలుగు సినిమాలు వచ్చేవి. పైగా ఆ రోజుల్లో తెలుగు సినిమా పరిశ్రమ తమిళనాడులోనే ఉండేది. ఇక ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌ కు మకాం మార్చింది.

ఏఎన్నార్ ప్రోత్సాహంతో మొత్తమ్మీద టాలీవుడ్ కేరాఫ్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్ అయింది. ఇక ఆ తర్వాత ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి.

NTR

ముఖ్యంగా తెలుగు సినిమా అప్పటి స్టార్‌ హీరోలు ఎన్సీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ తెలుగు సినిమా అభివృద్ధి కోసం చాలా కృషి చేశారు. దర్శక నిర్మాతలు అయినా డి రామానాయుడు, దర్శకరత్న దాసరి కూడా తెలుగు సినిమాకు కొత్త రూపాన్ని అద్దారు. అయితే, ఎందరు ఎన్ని చేసినా.. అక్కినేని అన్నపూర్త స్తూడియోస్‌ ను కట్టిన తర్వాతే. తెలుగు సినిమాలకు డిమాండ్ పెరిగింది. కృష్ణ కూడా పద్మాలయ స్తూడియోస్‌ కట్టి తెలుగు సినిమా స్థాయిని పెంచారు.

Also Read: గజ్వేల్ లో పోటీచేయవద్దని కేసీఆర్ డిసైడ్ అయ్యాడా? అందుకే భయపడుతున్నాడా?

అలాగే తెలుగు నిర్మాతల పొడక్షన్‌ హస్‌ లు సక్సెస్‌ ఫుల్‌ గా కొనసాగాయి. అయితే, అప్పట్లో తెలుగు సినిమాలకు ఎన్నడూ వందల కోట్లలో బడ్జెట్‌ అయ్యేది కాదు. అసలు ఓవర్ బడ్జెట్ అనే పదానికే మన అప్పటి స్టార్లు పూర్తి వ్యతిరేకం. పైగా అప్పటి మన స్టార్‌ హీరోలు కూడా కోట్లలో రెమ్యూనరేషన్‌ తీసుకునే వారు కాదు.

ANR

మరి ఏ స్టార్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకునే వారో చూద్దాం.

ముందుగా సీనియర్ ఎన్టీఆర్.. ఎన్టీఆర్ సినిమాకు 50 లక్షల బడ్జెట్‌ అయ్యేది. ఎన్టీఆర్ సినిమాలు మాత్రమే అప్పట్లో హైయెస్ట్‌ బడ్జెట్‌ సినిమాలుగా ఉండేవి.

ఎన్టీఆర్ – ఒక్కో సినిమాకు 12 లక్షలు రెమ్యూనరేషన్‌ తీసుకునే వారని తెలుస్తోంది.

ఏఎన్నార్‌ సినిమాలకు 30 నుంచి 40 లక్షలు బడ్జెట్‌ అయ్యేది. ఇక ఆయన రెమ్యూనరేషన్‌ విషయాన్ని వస్తే..

ఏఎన్నార్‌ – ఒక్కో సినిమాకు 10 లక్షలు రెమ్యూనరేషన్‌ తీసుకునే వారని తెలుస్తోంది.

Krishna

కృష్ణ గారి సినిమాలకు 20 నుంచి 30 లక్షల బడ్జెట్‌ అయ్యేది. ఇక ఆయన రెమ్యూనరేషన్‌ విషయాన్ని వస్తే..

కృష్ణ – ఇక కృష్ణ ఒక్కో సినిమాకు 7 లక్షలు రెమ్యూనరేషన్‌ తీసుకునే వారని తెలుస్తోంది.

మొత్తమ్మీద అప్పట్లో సౌత్‌ ఇండస్ట్రీలో పారితోషకంలో ఒక్క ఎన్టీఆర్‌ గారు మాత్రమే టాప్‌ లో ఉండేవారట. పైగా సీనియర్ ఎన్టీఆర్ సినిమాలకు విపరీతంగా కలెక్షన్స్ వచ్చేవి అట.

Also Read:  అఖండ’ స్పెషల్ షోతో ఊరంతా ఊగిపోయింది !

Tags