https://oktelugu.com/

NTR Role in RRR: RRR లో తారక్ పాత్రని అందుకే తగ్గించాము

NTR Role in RRR: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం ఇటీవలే విడుదల అయ్యి సంచలన విజయం సాధించి వెయ్యి కోట్ల రూపాయిల క్లబ్ లోకి చేరిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా ఈ స్థాయి సక్సెస్ సాధించడం చిత్ర యూనిట్ మొత్తం ఎంతో సంతోహం గా ఉంది..ముఖ్యంగా రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ వాళ్ళిద్దరి కేటాయించిన నాలుగేళ్ల అమూల్యమైన సమయానికి తగిన ఫలితం రావడం తో ఎంతో సంతృప్తి చెందారు..ఈ సినిమా […]

Written By: Neelambaram, Updated On : April 15, 2022 3:30 pm
Follow us on

NTR Role in RRR: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం ఇటీవలే విడుదల అయ్యి సంచలన విజయం సాధించి వెయ్యి కోట్ల రూపాయిల క్లబ్ లోకి చేరిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా ఈ స్థాయి సక్సెస్ సాధించడం చిత్ర యూనిట్ మొత్తం ఎంతో సంతోహం గా ఉంది..ముఖ్యంగా రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ వాళ్ళిద్దరి కేటాయించిన నాలుగేళ్ల అమూల్యమైన సమయానికి తగిన ఫలితం రావడం తో ఎంతో సంతృప్తి చెందారు..ఈ సినిమా తర్వాత మా కెరీర్ రూపు రేఖలు మొత్తం మారిపోయాయి..ఇన్ని రోజులు తెలుగు ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన మేము ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్స్ అయ్యాము..ఇక నుండి మా సినిమాలు ఇతర రాష్ట్రాల్లో కూడా ఆడేస్తాయి అంటూ ఇద్దరు హీరోలు ఎంతో ఉత్సాహం తో ఉన్నారు..కానీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఈ సినిమా పట్ల మొదటి రోజు నుండి అసంతృప్తి ని తెలియచేస్తూనే ఉన్నారు..మా హీరో ఎన్టీఆర్ పాత్ర ని బాగా తగ్గించేశారు అని..ఈ సినిమా చూసేవారికి రామ్ చరణ్ సినిమాలో ఎన్టీఆర్ ఒక్క సపోర్టింగ్ రోల్ చేసినట్టు అనిపిస్తాది అని..ఈ పాత్ర కోసం మా హీరో మూడేళ్ళ అమూల్యమైన సమయం ని వేస్ట్ చేసారు అంటూ రాజమౌళి ని సోషల్ మీడియా లో టాగ్ చేస్తూ ఎన్టీఆర్ ఫాన్స్ తెగ తిడుతున్న సంగతి మన అందరికి తెలిసిందే.

NTR Role in RRR

NTR Role in RRR

ఈ విషయం పై యూటీవల జరిగిన ఒక్క ఇంటర్వ్యూ లో యాంకర్ రాజమౌళి తో మాట్లాడుతూ ‘రామ్ చరణ్ పాత్ర ని పెంచడానికే ఎన్టీఆర్ పాత్ర ని బాగా తగ్గించేశారు అని ఎన్టీఆర్ అభిమానులు ఫీల్ అవుతున్నారు..దీనికి మీరు ఏమి సమాధానం చెప్తారు’ అంటూ అడిగిన ప్రశ్న కి రాజమౌళి సమాధానం చెప్తూ ‘ఒక్కవేల నేను ఇద్దరి హీరోలను సమానంగా బాలన్స్ చెయ్యకపొయ్యి ఉంటె ఈరోజు #RRR సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదు..చూసే జనాలకు ఒక్క నిమిషం కూడా ఒక్కరి పాత్ర తగ్గినట్టు అనిపించదు..ఫస్ట్ హాఫ్ మొత్తం ఎన్టీఆర్ స్టోరీ అలాగే సెకండ్ హాఫ్ మొత్తం రామ్ చరణ్ స్టోరీ చూపించాము..జనాలు థియేటర్స్ నుండి బయటకి వచ్చేటప్పుడు ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ని ఎక్కువ గుర్తు పెట్టుకుంటారు కాబట్టి రామ్ చరణ్ నే మేము ఎక్కువ హైలైట్ చేసినట్టు అభిమానులకు అనిపించి ఉండొచ్చు..చూసే విధానం బట్టి ఉంటుంది ఏదైనా..ఇందులో రామరాజు భీం ని ఆదర్శం గా తీసుకుంటాడు..అప్పుడు అభిమానులు ఎన్టీఆర్ ని రామ్ చరణ్ ఫాలో అవుతున్నాడు , ఆయనే హీరో అని అనుకోవచ్చు కదా..అలాగే రామ్ చరణ్ ని లాస్ట్ లో ఎన్టీఆర్ చదువు నేర్పించి అన్నా అంటాడు..అప్పుడు రామ్ చరణ్ ఈ సినిమా హీరోనా??..ఇక్కడే తెలిసిపోతుంది ఇద్దరిలో హీరో ఎవరో చెప్పడం ఎంత కష్టమో..ఎందుకంటే ఇద్దరినీ సరిసమానంగా చూపించాము కాబట్టి’ అంటూ సమాధానం ఇచ్చాడు రాజమౌళి.
Also Read: RRR Actor Ajay Devgn: తప్పు చేసి జైలు పాలైన RRR నటుడు అజయ్ దేవగన్

ఇక కొమురం భీముడొ సాంగ్ లో ఎన్టీఆర్ చూపించిన నటన గురించి రాజమౌళి మాట్లాడుతూ ‘కొమురం భీముడొ పాట లో ఎన్టీఆర్ చేసిన నటన భారత్ దేశం లో ఏ నటుడు కూడా చెయ్యలేడు..ఇది పెద్ద స్టేట్మెంటు అయ్యి ఉండొచ్చు నాకు తెలుసు..కానీ అది నిజం’ అంటూ చెప్పుకొచ్చాడు రాజమౌళి..ఇక ఈ సినిమా ఇటీవలే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి చేరిన సంగతి మన అందరికి తెలిసిందే..నాల్గవ వారం లోకి అడుగుపెట్టినప్పటికీ, KGF చాప్టర్ 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా నుండి తీవ్రమైన పోటీ ఎదురు అయ్యినప్పటికీ కూడా కలెక్షన్స్ విషయం ఏ మాత్రం ఊపు తగ్గలేదు అనే చెప్పాలి..ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి 600 కోట్ల రూపాయిల షేర్ 1100 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఈ చిత్రం, ఫుల్ రన్ లో ఇంకా ఎంత వసూలు చేస్తుందో చూడాలి.

Also Read: RRR vs KGF 2 Box Office Collection: షాకింగ్ : అక్కడ ఆర్ఆర్ఆర్ కి 20 కోట్లు, కేజీఎప్ కి 45 కోట్లు !

Tags