Vijayashanti: క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ ఎన్టీఆర్ తో ఓ పాన్ ఇండియా సినిమా చేయాలని కమిట్ అయిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మరో కీలక పాత్ర ఉందని.. ఆ పాత్ర ఎన్టీఆర్ కి సవతి తల్లి పాత్ర అని.. కాగా ఆ పాత్రలో విజయశాంతి నటించబోతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అయితే, మొదట ఆ పాత్రలో ఒకప్పటి మరో స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్ ను తీసుకోవాలని కొరటాల ప్లాన్ చేశాడట. కానీ చివరకు విజయశాంతిని ఫైనల్ చేశారు.

Also Read: చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం… కరోనాతో స్టార్ డైరెక్టర్ మృతి
ఇక ఈ పాత్ర సినిమాలోనే కీలకం అట. ఇప్పటికే ఎన్టీఆర్ కి సినిమాలో బాబాయ్ పాత్ర ఉందని.. ఆ పాత్ర కూడా వెరీ ఎమోషనల్ గా ఉంటుందని.. అందుకే ఆ పాత్రలో హీరో రాజశేఖర్ ను తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా కూడా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిని ఒప్పించాలని ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ ఆ విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు అయితే.. సినిమా మార్కెట్ కి ఇంకా బాగా ఉపయోగపడుతుంది అని కొరటాల కూడా ఫీల్ అవుతున్నాడు.

కాగా సుధాకర్ మిక్కిలినేని, కళ్యాణ్ రామ్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే సమ్మర్ నుంచి ఈ సినిమా షూట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అన్నట్టు ఇప్పటికే ఈ సినిమా కోసం భారీ సెట్స్ కూడా వేసారు. పైగా జూబ్లీహిల్స్ లోని ఎన్టీఆర్ ఇంటి పక్కనే ఆ పెద్ద సెట్ వేశారు. సినిమాలో ఎక్కువ భాగం ఈ సెట్ లోనే ఉంటుందని.. ఎన్టీఆర్ కి చాలా టైం కలిసివస్తుందని కొరటాల శివనే స్వయంగా చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా ఎన్టీఆర్ కి సవతి తల్లిగా విజయశాంతి నటిస్తే.. కాంబినేషన్ అదిరిపోతుంది.
Also Read: ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన ఉద్యోగులు.. దెబ్బకు అత్యవసర కేబినెట్ భేటీ పెట్టిన జగన్..!
[…] Avinash: జబర్దస్త్ వేదికగా ఎదిగిన కమెడియన్స్ లో ముక్కు అవినాష్ ఒకరు. టీమ్ సభ్యుడిగా ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ తో టీమ్ లీడర్ అయ్యాడు. కెవ్వు కార్తీక్ తో కలిసి ఒక టీమ్ లీడర్ గా స్కిట్స్ చేస్తూ ఉండేవాడు. కామెడీ టైమింగ్ తో పాటు మిమిక్రీ అవినాష్ అదనపు బలం. జబర్దస్త్ పై దూసుకుపోతున్న సమయంలో బిగ్ బాస్ ఆఫర్ రావడంతో టెంప్ట్ అయ్యాడు. అగ్రిమెంట్ ని బ్రేక్ చేసి బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్నారు. జబర్దస్త్ ని మధ్యలో వదిలేసినందుకు నిర్వాహకులు పది లక్షల రూపాయలు తీసుకున్నారని, సంచలన వ్యాఖ్యలు కూడా చేశాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లో చివరి వరకు కొనసాగిన అవినాష్… రెండు వారాల్లో ఫైనల్ అనగా ఎలిమినేట్ అయ్యాడు. […]